కశ్మీర్ (Kashmir) లోని పహల్గామ్ (Pahalgam)లో ఉగ్రదాడి (Terrorist Attack) అనంతరం భారత్-పాకిస్తాన్ (India-Pakistan) మధ్య వైరం తారాస్థాయికి చేరింది. బార్డర్‌లో పాక్ కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నా ఇండియాన్ ఆర్మీ (Indian Army) సంయమనం పాటిస్తోంది. ఏ క్షణాన అయినా అణు బాంబుల మోత మోగవచ్చనే సంకేతాలు వెల్లడవుతున్నాయి. ప్రధాని మోడీ (Modi) కూడా ఇండియన్ ఆర్మీకి పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. ఉగ్రవాదానికి అంతానికి సైన్యమే నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు.
సరిహద్దు వద్ద పాకిస్తాన్ ఆగడాలు తీవ్రమవుతున్న నేపథ్యంలో యుద్ధం ఎప్పుడైనా మొదలవ్వొచ్చనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత్‌కు అగ్రరాజ్యం నుంచి మద్దతు లభించింది. కేంద్ర రక్షణ శాఖ మంత్రి (Union Defence Minister) రాజ్ నాథ్ సింగ్ (Rajnath Singh) కు అమెరికా రక్షణ శాఖ (USA Secretary of Defence ) కార్యదర్శి హెగ్సేత్ (Hegseth) ఫోన్ చేశారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ తీసుకునే చర్యలకు తాము మద్దతిస్తామని (Support) అగ్రరాజ్యం రక్షణ శాఖ కార్యదర్శి వెల్లడించారు. అమెరికా భారత్‌కు అండగా నిలబడుతుందని తెలిపారు. భారత్‌కు రక్షణ చర్యలు తీసుకునే హక్కు ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఉగ్రవాదంపై ప్రపంచం గుడ్డిగా వ్యవహరించొద్దని, ఉగ్రవాదానికి అండ నిలుస్తున్న చరిత్ర పాకిస్తాన్‌కు ఉందని రాజ్‌నాథ్ సింగ్ అమెరికా మంత్రికి వివరించారు.







