అమెరికాలో ఘోర ప్రమాదం.. న్యూ ఇయర్ వేడుకల్లో విషాదం

అమెరికాలో ఘోర ప్రమాదం.. న్యూ ఇయర్ వేడుకల్లో విషాదం

అమెరికాలోని లూసియానా రాష్ట్రం, న్యూ ఆర్లీన్స్ నగరంలో కొత్త ఏడాది వేడుకలు విషాదంతో ముగిశాయి. న్యూ ఇయర్ వేడుకల్లో ఊరేగింపులో ఉన్నప్పుడు ఓ కారు వేగంగా దూసుకురావడంతో దారుణమైన ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో 10 మంది మరణించగా, 30 మందికి పైగా గాయపడినట్లు సమాచారం. ప్రాథమిక సమాచారం ప్రకారం ఈ ఘాతుకానికి ఒక వ్యక్తి కావాలనే పూనుకున్నట్లు అనుమానం వ్యక్తమవుతోంది. అయితే, ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు ఇంకా వెల్లడికావాల్సి ఉంది.

Join WhatsApp

Join Now

Leave a Comment