IPL 2026 క్రికెట్ ప్రేమికులకు ఈసారి పూర్తి స్థాయి ఎంటర్టైన్మెంట్ అందిస్తోంది. అభిమానులు తమ ఫేవరెట్ టీమ్స్, ప్లేయర్స్‌కు మద్దతు ఇస్తూ మ్యాచ్‌లను ఆస్వాదిస్తున్నారు. ఈ ఉత్సాహం మరింత పెరగనుంది, ఎందుకంటే ఏప్రిల్ 5 నుంచి మే 22 వరకు ఉప్పల్‌లోని రాజీవ్ గాందీ ఇంటర్ననేషనల్ క్రికెట్ స్టేడియం (Rajiv Gandhi International Cricket Stadium) లో కీలక మ్యాచ్‌లు జరగనున్నాయి. మ్యాచ్‌లు ఎలాంటి అంతరాయం లేకుండా నిర్వహించేందుకు సుమారు 2000 మంది పోలీసు సిబ్బందిని మోహరించారు. లా అండ్ ఆర్డర్ (Law and Order), ట్రాఫిక్ (Traffic), టీఎస్ఎస్పీ, ఆర్మ్డ్ రిజర్వ్ (Armed Reserve), బాంబ్ డిస్పోజల్ టీమ్‌లు సమన్వయంతో పనిచేస్తూ భద్రతను కట్టుదిట్టం చేస్తున్నాయి.
స్టేడియం పరిసరాల్లో 430 సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేయగా, ప్రత్యేక కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి నిరంతర పర్యవేక్షణ కొనసాగుతోంది. స్నిఫర్ డాగ్స్, యాంటీ సబోటేజ్ చెక్స్ కూడా నిర్వహిస్తున్నారు. ప్రేక్షకుల భద్రత కోసం మద్యం, గాజు సీసాలు, కత్తులు, లైటర్లు, లేజర్ పాయింటర్లు, బ్యాగులు వంటి నిషేధిత వస్తువులను అనుమతించరు. ప్రతి గేట్ వద్ద స్కానింగ్ సిస్టమ్‌తో పాటు అనుమానాస్పద వ్యక్తులపై ప్రత్యేక నిఘా ఉంటుంది. ట్రాఫిక్ రద్దీ తగ్గించేందుకు డైవర్షన్లు అమలు చేస్తూ, వాహనాల పార్కింగ్‌కు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్రేక్షకులు వ్యక్తిగత వాహనాలకంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వినియోగించాలని సూచించగా, మ్యాచ్‌కు మూడు గంటల ముందే స్టేడియంలోకి అనుమతి ఇవ్వనున్నట్లు పోలీసులు వెల్లడించారు.








