అదరగొడుతున్న ఉపేంద్ర ‘యూఐ’

అదరగొడుతున్న ఉపేంద్ర 'యూఐ'

కన్నడలో భారీ వసూళ్లతో దూసుకుపోతున్న యూఐ మూవీ తెలుగులోనూ దుమ్మురేపుతోంది. కన్నడ స్టార్ ఉపేంద్ర నటించిన యూఐ సినిమా ప్ర‌స్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఓ మోస్తరు వ‌సూళ్లు రాబ‌డుతోంది. ప్ర‌స్తుతం తెలుగులో కొత్త సినిమాలేవీ రిలీజ్ కాక‌పోవ‌డంతో యూఐ సినిమాకు క్రేజ్ పెరిగింది.

యూఐ సినిమా కన్నడ ప్రేక్షకులను మంత్రముగ్దులను చేస్తూ, విడుదలైన రెండు రోజుల్లోనే రూ. 13.5 కోట్ల వసూళ్లను రాబట్టిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా సినిమా ఓ మోస్తరు కలెక్షన్లు రాబడుతూ, తొలి రోజుకు రూ. 80 లక్షలు, రెండో రోజుకు రూ. 65 లక్షల మేర వసూలు చేసింది.

ఈ సినిమా ఉపేంద్ర నటనతో పాటు, ఆసక్తికరమైన కథనం, గ్రాండియస్ విజువల్స్‌తో ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంటోంది. సినిమా విజయవంతమైన టాక్‌తో టాలీవుడ్‌లో కూడా మరింత వసూళ్లతో దూసుకుపోవడం ఖాయం అంటున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment