కోర్టు హాల్‌లో దారుణం.. లాయర్‌పై మహిళల దాడి

కోర్టు హాల్‌లో దారుణం.. లాయర్‌పై మహిళల దాడి

కోర్టు హాల్‌ (Court Hall) లోనే ఓ లాయర్‌ (Lawyer)ను ఇద్దరు మహిళలు (womens) చితకబాదారు. ఈ దారుణ ఘ‌ట‌నకు సంబంధించిన‌ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఉత్తరప్రదేశ్‌ (Uttar Pradesh) రాష్ట్రంలోని బస్తీ జిల్లా (Basti District) సివిల్ కోర్టు (Civil Court)లో గురువారం జ‌రిగిన ఈ ఉదంతం.. అందరినీ షాక్‌కు గురిచేసింది. సివిల్ కోర్టు నుంచి బయటకు వస్తున్న లాయర్‌ను మహిళలు అడ్డగించి ఒక్కసారిగా దాడి (Attack) కి దిగారు. మొదట నెమ్మదిగా ప్రారంభమైన ఈ ఘర్షణ.. కాసేపటికే ఉధృతంగా మారింది. అక్కడే ఉన్న ఇతర న్యాయవాదులు జోక్యం చేసుకుని వారిని విడదీశారు.

పోలీసుల కథనం ప్రకారం.. మహిళల్లో ఒకరు… లాయర్ ఫోన్‌లో తనతో దురుసుగా మాట్లాడాడని ఆరోపించగా, అదే కారణంగా కోర్టులో వచ్చినట్టు తెలిపింది. ఈ వివాదం మొదట మాటల తూటాలుగా ప్రారంభమై, చివరికి తిడుతూ కొట్టుకునే స్థాయికి చేరింది. ఈ ఘటనపై లాయర్‌ స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, బార్ అసోసియేషన్ (Bar Association) కూడా స్పందించింది. న్యాయవాదులకు భద్రత కల్పించాలంటూ పోలీసులకు విజ్ఞప్తి చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment