సీఆర్‌పీఎఫ్‌ డీజీగా వితుల్ కుమార్‌కు ఛాన్స్‌

సీఆర్‌పీఎఫ్‌ డీజీగా వితుల్ కుమార్‌కు ఛాన్స్‌

సీఆర్‌పీఎఫ్ డైరెక్టర్ జనరల్‌గా వితుల్ కుమార్‌ (Vitul Kumar) బాధ్య‌త‌లు స్వీక‌రించ‌నున్నారు. ప్రస్తుతం సీఆర్‌పీఎఫ్ డీజీగా ఉన్న అనీష్ దయాల్ సింగ్ ఈనెల 31న (నేడు) ప‌ద‌వీ విర‌మ‌ణ చేయ‌నున్నారు. కాగా, వితుల్ కుమార్ ఆ స్థానాన్ని చేపట్టనున్నారు. వితుల్ కుమార్ ఉత్తర ప్రదేశ్ క్యాడర్‌కు చెందిన 1993 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. ప్రస్తుతం సీఆర్‌పీఎఫ్ స్పెషల్ డైరెక్టర్ జనరల్‌గా పనిచేస్తున్నారు. రెగ్యులర్‌ డీజీ నియామకం జరిగే వరకు లేదా తదుపరి ఉత్తర్వులు జారీ అయ్యే వరకు వితుల్ కుమార్‌ ఈ బాధ్యతలను నిర్వహిస్తారు.

Join WhatsApp

Join Now

Leave a Comment