---Advertisement---

అప్పుడే పుట్టిన‌ కంపెనీకి వేల కోట్ల విలువైన భూమి.. ఉర్సా వెన‌కున్న‌ది ఎవ‌రు..?

అప్పుడే పుట్టిన‌ కంపెనీకి వేల కోట్ల విలువైన భూమి.. ఉర్సా వెన‌కున్న‌ది ఎవ‌రు..?
---Advertisement---

కంపెనీ (Company) పుట్టి రెండు నెల‌లే. అదీ రూ.10 లక్షల క్యాపిటల్‌ ఇన్వెస్టిమెంట్‌తో మొదలైన కంపెనీ, రెండు తెలుగు రాష్ట్రాలలోని రూ.వేల కోట్లు పెట్టుబడులు పెట్టడానికి ఎలా ఒప్పందం కుదుర్చుంది..? క‌నీసం ఫోన్ నంబ‌ర్‌, ఈమెయిల్ అడ్ర‌స్ లేకుండా రూ.10 ల‌క్ష‌ల మూల‌ధ‌నంతో స్టార్ట్ అయిన కంపెనీ రూ.వేల కోట్ల పెట్టుబ‌డులు పెట్ట‌గ‌ల‌దా..? దీని వెనుక ఎవ‌రున్నారు..? అస‌లు పెట్టుబ‌డి పెట్ట‌గ‌ల‌దా..? ఏపీ ప్రభుత్వం (AP Government) తోనూ రూ.5,728 కోట్ల ప్రాజెక్టు, తెలంగాణ ప్ర‌భుత్వం (Telangana Government) తో రూ.5,000 కోట్ల కాంట్రాక్ట్ పొందింది. రెండు నెల‌ల క్రితం పుట్టిన కంపెనీకి వేల కోట్ల రూపాయ‌లు విలువ చేసే భూములు క‌ట్ట‌బెట్ట‌డం వెనకున్న మ‌ర్మం (Mystery) ఏంటి..? ఈ సంస్థ పుట్టుపూర్వ‌త్రాలు తెలుసుకుందాం..

ఊరూ పేరూలేని.. ఉర్సా
దావోస్(Davos)ప‌ర్య‌ట‌న‌లో రాష్ట్రానికి పెట్టుబడులు సాధించుకురావడంలో ఘోరంగా విఫలమైన కూటమి సర్కారు.. వేల కోట్ల విలువైన భూములను అస్మదీయ కంపెనీలకు కట్టబెట్టడానికి మాత్రం తెగ ఆరాటపడుతోంది. రాష్ట్రంలో కొత్త పరిశ్రమలు, కొత్త ఉద్యోగాలు రాకపోగా.. ప్రభుత్వం భూములను మాత్రం ఊరుపేరు కంపెనీల‌కు అప్ప‌నంగా క‌ట్ట‌బెడుతున్న విధానం ఇటీవ‌ల బ‌ట్ట‌బ‌య‌లైంది. రెండు నెలలు కూడా నిండని కంపెనీకి రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా 59 ఎకరాలు (59 acres) కేటాయించింది. ఈ రెండు నెలల వయసు ఉన్న కంపెనీకి టీసీఎస్‌కు భూమిచ్చిన చోటే 3.6 ఎకరాలు, ఐపీ కాపులుప్పాడలో 56 ఎకరాలు మొత్తం 59 ఎకరాలు ఏపీ ప్రభుత్వంకేటాయించింది. ఐటీ రంగంలో ఊరూ పేరూ తెలీని ఉర్సా క్లస్టర్స్‌ప్రైవేట్‌ లిమిటెడ్‌ (URSA Clusters Pvt. Ltd.) పట్ల చంద్ర‌బాబు ప్ర‌భుత్వానికి (Chandrababu’s Government) ఎందుకంత ప్రేమ అని ప్ర‌శ్న‌లు తెలుత్తుతున్నాయి. విశాఖపట్నంలోని ఐటీ హిల్ నం.3లో 1,370 కోట్ల పెట్టుబడితో ఐటీ క్యాంపస్ ఏర్పాటు కోసం 12,000 మందికి ఉపాధి అవకాశాలు కల్పించడానికి టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ లిమిటెడ్‌కి మొత్తం 21.16 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించింది. అదే టీసీఎస్‌ క్యాంపస్‌ పక్కన ఐటీ పార్క్‌లో 3.5 ఎకరాల భూమిని ఉర్సా క్లస్టర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కి కేటాయించారు. దాంతో పాటు ఐపీ కాపులుప్పాడలో 56.36 ఎకరాల భూమిని ఉర్సా క్లస్టర్స్‌ ప్రైవేట్‌లిమిటెడ్‌కి కేటాయించారు.

అసలేంటీ ఉర్సా..? ఎప్పుడు పుట్టింది?
హైదరాబాద్ (Hyderabad) హెడ్ ఆఫీస్‌గా రెండు నెలల క్రితం (2025 ఫిబ్రవరి 12) ఉర్సా కంపెనీ ప్రారంభమైంది. రూ.10 ల‌క్ష‌ల ఆథరైజుడు క్యాపిటల్‌ (Authorised Capital), రూ.1 లక్ష పెయిడప్‌తో ఇద్దరు డైరెక్టర్లతో ఈ కంపెనీ రిజిస్టరు చేశారు. ఇందులో డైరెకర్ట్స్‌గా కౌశిక్‌ పెందుర్తి (Kaushik Pendurthi), సతీష్‌ అబ్బూరి (Satish Abburi) ఉన్నారు. కౌశిక్‌ పెందుర్తి ప్రస్తుతం టాలస్‌ పే అనే కంపెనీలో సీపీటీవోగా విధులు నిర్వహిస్తున్నట్లు ఆయన లింక్డ్ ఇన్‌ అకౌంట్ తెలియచేస్తోంది. అంటే కౌశిక్‌ అమెరికాలో ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఓ స్థాయిలో పని చేస్తున్న ప్రైవేటు ఉద్యోగి. సతీష్‌ అబ్బూరి ఎలిసియం అనలిటిక్స్‌ కు వ్యవస్థాపకుడు, చీఫ్‌ టెక్నాలజీ ఆఫీసర్‌గా వ్యవహరిస్తున్నారు. దీంతో పాటు యూఎస్‌లో రిజిస్ట్రర్‌ చేసిన ఉర్సా క్లస్టర్స్‌ లిమిటెడ్‌ లయబిలిటీ కంపెనీ. ఇందులో కూడా ఈ ఇద్దరే డైరెక్టర్స్‌గా వ్యవహరిస్తున్నారు. అయితే ఉర్సా క్లస్టర్స్‌ లిమిటెడ్ లయబిటీ కంపెనీకి కూడా ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చిన కొద్ది నెలల తరువాత 2024 సెప్టెంబర్‌ 27న రిజిస్టర్‌ చేశారు.

మూడు బెడ్‌రూమ్‌ల ఫ్లాట్‌లో ఆఫీస్‌..
ఈ కంపెనీకి అనుబంధ సంస్థగా చెప్పుకుంటూ ఇండియా ఉర్సా క్లస్టర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ అనే సంస్థను 2025 ఫిబ్రవరి 12న రిజిస్టర్‌ చేశారు. ఉర్సా క్లస్టర్స్‌ ప్రైవేట్ లిమిటెడ్‌ కంపెనీ అడ్రస్‌గా “ప్లాట్‌ నెంబర్‌ 705 ఏక్తా బాసిల్‌ హైట్స్ కొత్తగూడ, హైదరాబాద్‌, తెలంగాణ 500084” ఒక రెసిడెషియల్‌ అపార్ట్మెంట్‌లోప్లాట్‌ చూపించారు. ఉర్సా ఆఫీస్‌గా చూపించిన ఆ ప్లాట్‌లో ఒక ఫ్యామిలీ నివాసముంటున్నారు. ఈ అపార్ట్మెంట్‌ పూర్తిగా రెసిడెన్షియల్. ఇందులో 28 ఫ్లాట్‌లు (ఒక్కో అంతస్తుకు మూడుబెడ్‌ రూంల వసతి కలిగిన నాలుగు ఫ్లాట్లు ఉన్నాయి. కేవలం రెండు నెలలవయసున్న, కనీసం ఒక ఆఫీస్‌, ఫోన్‌ నెంబర్‌, వెబ్‌సైట్‌ కూడా లేని కంపెనీకి కొన్ని వందల కోట్లు విలువ చేసే భూములు, వేలకోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టును ఏపీ ప్రభుత్వం ఇవ్వడం ఇప్పుడు పలు సందేహాలకు దారితీస్తోంది.

అనుభ‌వం ఉందా..?
ఇదిలా ఉంటే రూ.5,728 కోట్ల పెట్టుబడి పెడతామని ముందుకొచ్చిన ఈ కంపెనీ కేవలం 10 లక్షల రూపాయల ఆథరైజ్డ్‌ క్యాపిటల్‌ను, లక్ష రూపాయిల పెయిడప్‌ క్యాపిటల్‌ను మాత్రమే కలిగి ఉండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఇంత తక్కువ పెట్టుబడితో ఎటువంటి అనుభవం లేకుండా కంపెనీ రిటర్న్‌ గిఫ్ట్‌గా విశాఖలో వెయ్యి కోట్ల రూపాయ‌ల విలువైన భూములను కొట్టేసింది. ఇలాంటి కంపెనీని ఏపీ ప్రభుత్వం ఎందుకు నమ్మింది. దీని వెనుక ఇంకెవరైనా వున్నారా అన్నది తెలియాల్సి వుంది.

కనీసం ఫోన్‌ నెంబర్స్‌ లేని కంపెనీలు..
ఉర్సా ఎల్‌ఎల్‌సీ అండ్‌ ఉర్సా క్లస్టర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్ (URSA LLC & URSA Clusters Pvt. Ltd) అనుబంధ సంస్థలుగా ఉన్నాయి. ఆశ్యర్యకరంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి దాదాపు 10 వేల కోట్లకుపైగా విలువైన ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చిన ఈ రెండు కంపెనీలకు కనీసం ఒక ఫోన్‌ నెంబర్‌ (Phone Number) కాని, ఈ మెయిల్‌ ఐడీలు (Email ID) కాని లేవు. దీంతో పాటు ఈరెండు కంపెనీలు ఇప్పటి వరకు ఎలాంటి కార్యకలాపాలు చేసిన దాఖలాలు కూడా లేవు. ఇన్ని వేల కోట్లు పెట్టుబడులు పెట్టే కంపెనీలకు కనీసం సరైన ఆఫీస్‌లు కూడా లేదు. అలాంటి కంపెనీకి కూట‌మి ప్ర‌భుత్వం 59 ఎక‌రాల భూమి ఎందుకు క‌ట్ట‌బెట్టింద‌నేది బిగ్ క్వ‌శ్చ‌న్‌.

ఎన్నో సందేహాలు.. ఎందుకంత భూమి
సింగిల్‌ ట్రీ సిటి ప్లెసాంటన్‌, సిఎఫ్‌ 94588 యూఎస్‌ఏ అడ్రస్‌లో ఉన్న ఈకంపెనీ కూడా కేవలం 1560 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఒక సింగిల్‌ ఫ్యామిలీ నివసించడానికి సరిపోయే మూడు బెడ్‌రూమ్‌లు రెండు బాత్రూమ్‌లుతో కూడిన ఒక సాధారణ ఇల్లు. అయితే ఇంత చిన్న ఇంట్లో ఉండే కంపెనీ, కనీసం పట్టుమని పది మంది సిబ్బంది కూడా లేని కంపెనీ అటు తెలంగాణలో ఇటు ఆంద్రప్రదేశ్‌లో భారీపెట్టుడులు ఎలా పెట్టగలదనే సందేహాలు వెల్లువెత్తుతున్నాయి.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment