శ్రీవారి పాదాల చెంత ముంతాజ్ హోటల్ నిర్మాణానికి అనుమతులు ఇవ్వడంపై స్వామీజీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముంతాజ్ అనుమతులను రద్దు చేయాలని కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ శ్రీనివాసానంద సరస్వతి స్వామి నేతృత్వంలో పలువురు స్వామీజీలు ఆమరణ నిరాహార దీక్ష దిగారు.
అలిపిరిలోని టీటీడీ పరిపాలన భవన్ వద్ద స్వామీజీలు ఆందోళన చేపట్టారు. “తిరుమలను ప్రక్షాళన చేస్తానన్న చంద్రబాబు ఎక్కడ?”, “సనాతన ధర్మం అంటూ గగ్గోలు పెట్టిన పవన్ కల్యాణ్ ఎందుకు మౌనం?” అని ప్రశ్నలు లేవనెత్తారు. ఈ నేపథ్యంలో పలువురు భక్తులు, హిందూ సంఘాలు వారి నిరసనకు మద్దతుగా నిలిచాయి.
టీటీడీ బోర్డు మీటింగ్‌లో ముంతాజ్ హోటల్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ తీర్మానం చేసింది. అయినా కూటమి ప్రభుత్వం మాత్రం స్థలాన్ని కేటాయించిందని, ముంతాజ్ హోటల్‌కు కేటాయించిన స్థలం వెనక్కి తీసుకోవాలంటూ పలువురు స్వామీజీలు డిమాండ్ చేస్తున్నారు. వారాహి డిక్లరేషన్ అంటే తిరుమల ఏడుకొండలలో ముంతాజ్ హోటల్ నిర్మించడమా..?, సీజ్ ద ముంతాజ్ ఎప్పుడు అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను ప్రశ్నిస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. మరి స్వామీజీల ఆందోళనపై ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి.








