టీటీడీ గోశాల (TTD Gosala) లో గోవుల మృతి (Cows Deaths)పై ఆంధ్రరాష్ట్ర రాజకీయం వేడిక్కింది. అధికార టీడీపీ (TDP), ప్రతిపక్ష వైసీపీ(YSRCP) మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఛాలెంజ్‌ల పర్వంలో భాగంగా గురువారం ఉదయం నుంచి తిరుపతిలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో టీటీడీ గోశాల మేనేజర్ పేరుతో రిలీజ్ అయిన ఒక రిపోర్టు కూటమి ప్రభుత్వానికి, టీటీడీ పాలక మండలితో పాటు శ్రీవారి భక్తులను షాక్‌కు గురిచేసింది. గోశాలలో గోమాతల మరణాలపై వైసీపీ చేస్తున్న ఆరోపణలకు ఆ రిపోర్టు బలాన్ని చేకూర్చింది.
గోశాలలో ఒక్క గోవు కూడా మృతిచెందలేదని ముఖ్యమంత్రి చంద్రబాబు (CM Chandrababu Naidu) ప్రకటించారు. ఆ తరువాత టీటీడీ చైర్మన్ (TTD Chairman) 20కిపైగా చనిపోయి ఉండొచ్చని వ్యాఖ్యానించారు. మరుసటి రోజే టీటీడీ ఈవో శ్యామలరావు (TTD EO Syamala Rao) ప్రెస్‌మీట్ పెట్టి 43 గోవులని క్లారిటీ ఇచ్చారు. కానీ అధికారిక లెక్కల మాత్రం భక్తులను షాక్‌కు గురిచేస్తున్నాయి. వైసీపీ ఆరోపిస్తున్నట్లుగా మృతిచెందిన గోవుల సంఖ్య 100 కాదు అని, 2024 ఏప్రిల్ నుంచి ఈ ఏప్రిల్ వరకు ఏకంగా 191 గోవులు చనిపోయినట్లుగా ఆ రిపోర్టులో ఉంది. ప్రస్తుతం ఈ రిపోర్టు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. గోశాల మేనేజర్ రిపోర్టు (Gosala Manager’s Report) ఆధారంగా వైసీపీ తన స్వరాన్ని పెంచింది.
సంవత్సరకాలంలో 191 గోవుల మృతి చెందడంపై శ్రీవారి భక్తులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన గోశాలలో ఒక్క ఆవు కూడా చనిపోలేదని సీఎం నారా చంద్రబాబు నాయుడు మరి ఈ రిపోర్ట్‌కు ఏం సమాధానం చెబుతారని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు (TTD Chairman B.R. Naidu) ఈ తప్పును ఎలా కప్పిపుచ్చుకుంటారని నిలదీస్తున్నారు. సనాతన ధర్మ పరిరక్షకుడు (Sanatana Dharma protector) పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఈ అంశంపై ఎందుకు స్పందించడం లేదని నెటిజన్లు నిలదీస్తున్నారు.
తిరుపతి
— Telugu Feed (@Telugufeedsite) April 17, 2025
కూటమి ప్రభుత్వానికి షాక్ ఇచ్చిన టిటిడి గోశాల అధికారులు
2024 ఏప్రిల్ – 25 మార్చి నెలవరకు చనిపోయిన గోవులు 191 అంటూ అధికారికంగా ప్రకటించిన గోశాల మేనేజర్#AndhraPradesh #TTD pic.twitter.com/8ZMpNZldIk
“బ్రాహ్మణులపై మూత్రం పోస్తా” – అనురాగ్ కశ్యప్ వివాదాస్పద వ్యాఖ్య