తిరుమల లడ్డూ ప్రసాదం భక్తుల విశ్వాసానికి ప్రతీక. ఎంతోమంది చాలా ఇష్టంగా తీసుకునే ప్రసాదం. తాజాగా TTD ఈవో శ్యామలరావు లడ్డూ తయారీపై స్పష్టతనిచ్చారు, భక్తుల సందేహాలను తొలగించారు. TTD ఈవో మాట్లాడుతూ.. “నాణ్యమైన ముడి సరుకులతోనే లడ్డూలు తయారు చేసి భక్తులకు అందజేస్తున్నాం. అన్నప్రసాదాల నాణ్యత విషయంలో ఏ మాత్రం రాజీ పడబోం” అని పేర్కొన్నారు. లడ్డూ తయారీ, అన్నప్రసాదాల తయారీలో అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేస్తారని తెలిపారు.
అవకతవకలపై చర్యలు
టూరిజం కోటాలో అవకతవకలు జరుగుతున్నాయనే ఆరోపణల నేపథ్యంలో ఆ కోటాను రద్దు చేశామని ఈవో ప్రకటించారు. సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని కార్యకలాపాల్లో పారదర్శకత కోసం చర్యలు చేపట్టామన్నారు.







