తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సభ్యుడు నరేశ్ ఉద్యోగిపై బూతుపురాణం ఘటన కొత్త మలుపు తిరిగింది. బోర్డు మెంబర్ తీరుతో ఉద్యోగ సంఘాలన్నీ ఏకమయ్యాయి. టీటీడీ ఉద్యోగి బాలాజీపై అనుచితంగా ప్రవర్తించిన బోర్డు సభ్యుడు నరేశ్‌ను తక్షణమే పాలకమండలి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ ఉద్యోగ సంఘాలు నిరసనకు పిలుపునిచ్చాయి.
టిటిడి లో మూడు ఉద్యోగ సంఘాలు ఏకమై గురువారం ఉదయం టీటీడీ పరిపాలనా భవనం ఎదుట నిరసనకు పిలుపునిచ్చాయి. బాధిత ఉద్యోగి బాలాజీకి బోర్డు మెంబర్ నరేశ్ క్షమాపణలు చెప్పాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణం బోర్డు మెంబర్ నరేశ్ సభ్యత్వం రద్దు చేయాలని కోరారు. ఉద్యోగ సంఘాలు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టీటీడీ ఉద్యోగులపై వేధింపులు ఎక్కువై పోయాయని ఉద్యోగ సంఘాలు ఆరోపిస్తున్నాయి. గత ఆరు నెలల్లో మరో మూడు ఘటనలో ఉద్యోగులను ఇబ్బందులు పెట్టి మరీ బదిలీ చేసిన వారిని, తిరిగి పూర్వపు స్థానాల్లో కొనసాగించాలని టీటీడీ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.