---Advertisement---

గోవుల మృతి.. టీడీపీ ఛాలెంజ్ – వైసీపీ యాక్సెప్ట్‌

గోవుల మృతి.. టీడీపీ ఛాలెంజ్ - వైసీపీ యాక్సెప్ట్‌
---Advertisement---

టీటీడీ గోవుల మృతి అంశం అధికార టీడీపీ – ప్ర‌తిప‌క్ష వైసీపీల మ‌ధ్య వివాదంగా మారింది. గోవుల చ‌నిపోయాయ‌ని టీటీడీ మాజీ చైర్మ‌న్ భూమ‌న ఫొటోలు విడుద‌ల చేసి సంచ‌ల‌నం సృష్టించ‌గా, లేదు గోవులు చ‌నిపోలేదు.. వైసీపీ హ‌యాంలోనే చ‌నిపోయాయంటూ చెబుతోంది. ఈనెల 11వ తేదీన చ‌నిపోయిన గోవులు, లేగ దూడ‌ల ఫొటోల విడుద‌ల‌తో మొద‌లైన ఈ వివాదం.. రోజు రోజుకూ ఏపీ రాజ‌కీయాల్లో వేడి పెంచుతూనే ఉంది. తాజాగా ఈ అంశంపై ఎక్స్ వేదిక‌గా ఛాలెంజ్‌ల ప‌ర్వం కొన‌సాగుతోంది.

డిఫెన్స్ మోడ్ నుంచి యాక్టీవ్‌
గోవుల అంశంపై తిరుమ‌ల వెంక‌న్న భ‌క్తులు, హైంద‌వ ధ‌ర్మ ప‌రిర‌క్ష‌కులు, ఏపీ ప్ర‌జ‌ల నుంచి తీవ్ర వ్య‌తిరేక రావ‌డంతో టీటీడీ కూడా దీనిపై క్లారిటీ ఇచ్చింది. మూడు నెల‌ల్లో 43 గోవులు చ‌నిపోయాయ‌ని ఈవో ప్ర‌క‌టించారు. ఈ అంశంపై డిఫెన్స్‌లో ప‌డిన‌ అధికార టీడీపీ యాక్టీవ్ అయ్యింది. గోవుల మృతి లేదంటూ, వైసీపీ త‌ప్పుడు ఆరోప‌ణ‌లు చేస్తోందంటూ త‌న అధికారిక సోష‌ల్ మీడియా ఖాతాలు, అనుకూల మీడియా ఛాన‌ళ్ల నుంచి ప్ర‌చారం మొద‌లుపెట్టింది. తాజాగా కౌంట్ డౌన్ పేరుతో మ‌రో ట్వీట్ చేసింది. మాజీ సీఎం వైఎస్ జగన్‌కి, భూమన కరుణాకర్‌రెడ్డికి ఛాలెంజ్ చేస్తూ.. ఏప్రిల్ 17వ తేదీన తిరుమలకు రండి.. గోశాలలో గోమాతలు ఎలా ఉన్నాయో కళ్లారా చూడండి అంటూ ట్వీట్ చేసింది.

టీడీపీ ట్వీట్‌కు భూమ‌న కౌంట‌ర్‌..
తెలుగుదేశం పార్టీ కౌంట్‌డౌన్ ట్వీట్‌కు టీటీడీ మాజీ చైర్మ‌న్ భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డి కౌంట‌ర్ ట్వీట్ పోస్ట్ చేశారు. ఛాలెంజ్‌ను స్వీక‌రిస్తున్న‌ట్లుగా తెలిపిన భూమ‌న‌.. “గోవులు తిరుమలలో కాదు, తిరుపతిలో చనిపోయాయి. ఈ విషయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానాల ఈవో కూడా స్పష్టం చేశారు. అయినప్పటికీ, జ్ఞానం లేకుండా రాజకీయ ప్రస్తావనలు చేయడం తగదు” అంటూ టీడీపీ రాష్ట్ర అధ్య‌క్షుడు ప‌ల్లా శ్రీ‌నివాస‌రావుపై మండిపడ్డారు. “రేపు ఉదయం 10 గంటలకు తిరుపతి గోశాలకు రండి. నేరుగా అక్కడే చూద్దాం గోవుల పరిస్థితిని” అంటూ స్పష్టం చేశారు. ఇరు పార్టీల ట్వీట్ల వార్‌తో ఏపీలో మ‌రోసారి రాజ‌కీయ వేడి పెరిగింది. రేపు ఉద‌యం 10 గంట‌ల‌కు ఏం జ‌రుగుతుందోన‌న్న టైన్ష‌న్ స‌ర్వ‌త్రా నెల‌కొంది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment