---Advertisement---

భారత్‌కు ట్రంప్‌ మ‌రో షాక్.. 26 శాతం ప్ర‌తీకార‌ సుంకం

భారత్‌కు ట్రంప్‌ మ‌రో షాక్.. 26 శాతం ప్ర‌తీకార‌ సుంకం
---Advertisement---

అమెరికా (America) అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తన హామీ ప్రకారం అనేక దేశాలపై ప్రతీకార సుంకాలు విధించారు. వైట్‌హౌస్‌లోని రోజ్ గార్డెన్‌ (Rose Garden) లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ట్రంప్ ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. కొత్త సుంకాలు అర్ధరాత్రి నుంచే అమల్లోకి వస్తాయని స్పష్టం చేశారు. ఈ సంద‌ర్భంగా ట్రంప్ మాట్లాడుతూ.. అమెరికా భవిష్యత్‌ తమ స్వంత పౌరుల చేతుల్లోనే ఉందని చెప్పారు. ఇతర దేశాలు అమెరికా ఉత్పత్తులపై భారీ సుంకాలు విధిస్తున్నాయని, తాము మాత్రం కొంత తక్కువగా (సగం) వసూలు చేస్తున్నామన్నారు.

భారత్‌ (India) పై 26 శాతం సుంకాన్ని (Tariff) విధిస్తున్నట్లు ప్రకటించిన ట్రంప్, భారత ప్రధాని నరేంద్ర మోడీ (Narendra Modi) తన మంచి స్నేహితుడే అయినా, అమెరికాతో సరైన విధంగా వ్యవహరించడం లేదని విమర్శించారు. భారత్ అమెరికా ఉత్పత్తులపై 52% సుంకం విధిస్తోందని ఆరోపించారు. ట్రంప్ వెల్ల‌డించిన వివ‌రాల ప్రకారం, గత 50 ఏళ్లుగా అమెరికా ట్యాక్స్ పేయర్లను ఇతర దేశాలు దోచుకుంటున్నాయని, ఇకపై అలా జరగనివ్వబోమని స్పష్టం చేశారు. ఈ కొత్త నిర్ణయం గ్లోబల్ ట్రేడ్‌ మార్కెట్‌ (Global Trade Market)పై ఎంత ప్రభావం చూపుతుందో చూడాలి.

ఇతర దేశాలపై సుంకాలు ఎంతంటే?
ట్రంప్ ప్రకటన ప్రకారం.. అమెరికాకు దిగుమతయ్యే అన్ని దేశాల ఉత్పత్తులపై కనీసం 10 శాతం టారిఫ్ విధించనున్నారు. కొన్ని దేశాలపై భారీగా సుంకాలు విధించగా, వాటిలో కంబోడియా (49%), శ్రీలంక (44%), బంగ్లాదేశ్ (37%), థాయిలాండ్ (36%) ఉన్నాయి. చైనాపై 34 శాతం టారిఫ్ విధించనుండగా, పాకిస్థాన్‌పై 29%, దక్షిణ కొరియాపై 25% సుంకం అమలులోకి రానుంది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment