ఇరాన్ యుద్ధంపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు..

ఇరాన్ యుద్ధంపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు..

పశ్చిమాసియా యుద్ధంపై అధ్యక్షుడు ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. మీడియాతో ట్రంప్ మాట్లాడుతూ త్వరలో ఇరాన్‌లో యుద్ధం ముగుస్తుందని తెలిపారు. ఇరాన్‌లో 5 వేల లక్ష్యాలను ఛేదించినట్లు తెలిపారు. ఇరాన్‌లో జరిగింది కేవలం స్వల్పకాల సైనిక చర్య మాత్రమే అని చెప్పారు. పశ్చిమాసియా యుద్ధంపై రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో మాట్లాడనన్నారు. యుద్ధం పట్ల పుతిన్ సంతృప్తిగానే ఉన్నారని తెలిపారు. ఇరాన్ సుప్రీం లీడర్‌గా ఖమేనీ కుమారుడు మొజ్తాబా నియామకం నిరాశపరిచిందన్నారు.

ఇదిలా ఉంటే ఇరాన్‌తో యుద్ధం త్వరలో ముగుస్తుందన్న ట్రంప్ వ్యాఖ్యలపై ఇరాన్ తీవ్రంగా స్పందించింది. యుద్ధాన్ని ఎప్పుడు ముగించాలో తాము నిర్ణయిస్తామని కౌంటర్ ఎటాక్ చేసింది. ఈ మేరకు ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ (IRGC) ఒక ప్రకటనలో పేర్కొంది. యుద్ధం ముగిసే సమయాన్ని నిర్ణయించేది తామేనని స్పష్టం చేసింది. భవిష్యత్ పరిణామాలు ఇప్పుడు తమ సైనికుల చేతిలో ఉన్నాయని.. కాబట్టి అమెరికా సైన్యం యుద్ధాన్ని ముగించలేరని పేర్కొంది.

గత నెల 28న ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా యుద్ధం చేశాయి. ఈ ఘటనలో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ హతమయ్యాడు. దీంతో అప్పటి నుంచి ఇరాన్ ప్రతీకారంగా ఇజ్రాయెల్, అమెరికా మద్దతు గల గల్ఫ్ దేశాలపై భీకర దాడులు చేసింది. అంతేకాకుండా హర్ముజ్ జలసంధిని కూడా మూసేసింది. దీంతో చమురు, గ్యాస్ కొరత ఏర్పడింది. ప్రస్తుతం పరిస్థితి సంక్షోభం దిశగా వెళ్తోంది.

Join WhatsApp

Join Now

Leave a Comment