అమెరికా అధ్యక్షుడు, రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న తాజా నిర్ణయం భారతీయ సినీ పరిశ్రమకు భారీ షాక్‌గా మారింది. ఇప్పటి వరకు అమెరికన్ వస్తువులు, ఆహార పదార్థాలపై ట్యాక్స్‌ల మీద ట్యాక్స్‌లు వేస్తున్న ట్రంప్.. తాజాగా తీసుకున్న నిర్ణయం ఇండియన్ సినిమాలపై భారీ ప్రభావం చూపనుంది. అమెరికా వెలుపల నిర్మించే అన్ని సినిమాలపై 100 శాతం సుంకం విధిస్తున్నట్టు ఆయన ప్రకటించారు. ఈ నిర్ణయం అమెరికాలో విడుదలయ్యే విదేశీ సినిమాలపై తీవ్ర ప్రభావం చూపనుంది.
ప్రత్యేకంగా తెలుగు సినిమాలు కూడా దీనికి మినహాయింపు కావు. ఇకపై అమెరికాలో తెలుగు సినిమాలను విడుదల చేయాలంటే నిర్మాతలు, పంపిణీదారులు వంద శాతం ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. ఈ సుంకం కారణంగా అమెరికాలో తెలుగు సినిమాల బాక్సాఫీస్ వసూళ్లు, బిజినెస్‌పై గణనీయమైన ప్రభావం పడనుంది.
ట్రంప్ తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. “మా సినిమా నిర్మాణ వ్యాపారాన్ని ఇతర దేశాలు దోచుకున్నాయి. ఇది ఒక పిల్లాడి నుండి చాక్లెట్ దొంగిలించినట్లే. ముఖ్యంగా బలహీనమైన గవర్నర్ కారణంగా కాలిఫోర్నియా తీవ్ర నష్టాన్ని చవిచూసింది. అందువల్ల యునైటెడ్ స్టేట్స్ వెలుపల నిర్మించే సినిమాలపై 100% సుంకం విధిస్తున్నాను” అని పేర్కొన్నారు. ట్రంప్ ఈ ప్రకటనతో ఇండియన్ సినిమాలు, ముఖ్యంగా తెలుగు చిత్రాలు భారీ సవాళ్లను ఎదుర్కొనాల్సి ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు.








