తమిళ చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం విజయ్ – త్రిషల పెళ్లి వార్తలు హాట్ టాపిక్‌గా మారాయి. వీరిద్దరూ త్వరలోనే మూడు ముళ్ల బంధంతో ఒకటి కాబోతున్నారంటూ కోలీవుడ్ మీడియాలో కథనాలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో త్రిష తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసిన ఒక ‘లవ్ కోట్’ వీడియో ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి..
‘ఇతరుల అభిప్రాయాలను లేదా ఆలోచనలను మీరు ఎలా నియంత్రించగలరు? మీరు చేయగలిగిందల్లా మీ జీవితాన్ని ఉత్తమంగా జీవించడమే. నిజాయితీతో బ్రతికినప్పుడు రాత్రిపూట హాయిగా నిద్రపోవచ్చు’ అంటూ సాగే ఒక సంభాషణను ఆమె పోస్ట్ చేశారు. తన వ్యక్తిగత జీవితంపై వస్తున్న రూమర్లను ఉద్దేశించే త్రిష ఈ రకమైన కౌంటర్ ఇచ్చారని నెటిజన్లు భావిస్తున్నారు.
కేరీర్ పరంగా కూడా త్రిష ఫుల్ బిజీగా ఉన్నారు. తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సరసన ‘విశ్వంభర’ వంటి భారీ సోషియో ఫాంటసీ చిత్రంలో నటిస్తున్న ఆమె, ఇండస్ట్రీలో తన స్థానం ప్రబలంగా నిలిపారు. రూమర్లేమైనా, సీనియర్ హీరోయిన్‌గా త్రిష ఇప్పటికీ స్టార్ హీరోల ప్రథమ ఎంపికగా ఉండటం విశేషం. అభిమానులు కూడా ఆమె ఈ పోస్ట్ ద్వారా వ్యక్తిగతం–ప్రొఫెషనల్ రెండింటినీ సమతులంగా చూస్తున్నారని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.








