ఆమె మా బంధువు.. మిమ్మ‌ల్ని ఊరికే వ‌ద‌ల‌ను.. టీడీపీ ట్రోలింగ్‌పై తోపుదుర్తి ఫైర్‌

Topudurthi Prakash Reddy's strong reaction to TDP's false propaganda on airport video

వైసీపీ (YSRCP) మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్ర‌కాశ్‌రెడ్డి (Thopudurthi Prakash Reddy) పై ఒక‌వ‌ర్గానికి చెందిన మీడియా, యూట్యూబ్ ఛాన‌ళ్లు ఉద‌యం నుంచి ఒక ప్ర‌చారాన్ని మొద‌లుపెట్టాయి. ఎయిర్‌పోర్టు (Airport) లో అమ్మాయితో తోపుదుర్తి క‌నిపించాడంటూ, యువ‌తితో ఆయ‌న‌కు సంబంధం ఉందంటూ అస‌భ్య‌క‌ర‌మైన హెడ్డింగ్స్, కామెంట్స్ పెడుతూ అధికార పార్టీకి చెందిన కొంద‌రు యూట్యూబ‌ర్లు, సోష‌ల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్స‌ర్లు తోపుదుర్తి ప్ర‌కాశ్‌రెడ్డిపై ట్రోల్స్ (Trolls) మొద‌లుపెట్టారు. అయితే దీనిపై తోపుదుర్తి సంచ‌ల‌న విష‌యాల‌ను వెల్ల‌డిస్తూ ఒక లేఖ‌ను విడుద‌ల చేశారు.

టీడీపీ దుర్మార్గ‌పు ప్ర‌చారం చేస్తోంది : తోపుదుర్తి
మాజీ సీఎం వైఎస్ జ‌గ‌న్‌ (YS Jagan) రామగిరి మండల ప‌ర్య‌ట‌నను అడ్డుకునే పరిస్థితి కనిపించ‌క‌పోవ‌డంతో తెలుగుదేశం పార్టీ (TDP) ఒక దుర్మార్గ‌మైన ప్ర‌చారానికి తెర‌తీసింద‌ని తోపుదుర్తి ప్ర‌కాశ్‌రెడ్డి మండిప‌డ్డారు. త‌న‌ సమీప బంధువులు త‌న కుటుంబ సభ్యులు అందర్నీ కూడా నీచపు రాజకీయ క్రీడలోకి లాగుతున్నారని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఒక వీడియోలో తాను ఎయిర్పోర్టులో త‌మ బంధువుల అమ్మాయితో (Relative’s Girl) మాట్లాడుతున్న వీడియో వైరల్ చేసి నీచమైన ప్ర‌చారం చేస్తున్నార‌ని ఫైర‌య్యారు. ఎవరైతే ఆ వీడియోని సోష‌ల్ మీడియాలో పోస్టు చేసి త‌న‌పై, త‌న కుటుంబ స‌భ్యుల‌పై త‌ప్పుడు ప్ర‌చారం చేస్తున్నారో వారిపై పోలీస్ కంప్ల‌యింట్ ఇచ్చి లీగల్ యాక్షన్ (Legal action) క‌చ్చితంగా తీసుకుంటాన‌ని హెచ్చ‌రించారు. త‌ప్పుడు ప్ర‌చారంతో త‌న ప్ర‌తిష్ట‌ను దిగ‌జార్చుతున్నార‌ని, 25 సంవత్సరాల త‌న రాజకీయ జీవితంలో సంపాదించుకున్న గౌరవ మర్యాదలకు నష్టం చేకూర్చుతున్నార‌ని మండిప‌డ్డారు. కాగా, తోపుదుర్తి ప్ర‌కాశ్‌రెడ్డి నుంచి స్ట్రాంగ్ రియాక్ష‌న్ రావ‌డంతో త‌ప్పుడు ప్ర‌చారానికి పాల్ప‌డిన వారు సోష‌ల్ మీడియాలో వారు పెట్టి పోస్టుల‌ను డిలీట్ చేస్తున్నారు.

త‌ప్పుడు ప్ర‌చారం: సుమయ ఆగ్ర‌హం..
టీడీపీ (TDP) ట్రోల్ చేస్తున్న వీడియోపై అటు తోపుదుర్తి బంధువు, ట్రోల్ ఎదుర్కొంటున్న యువ‌తి సుమయ రెడ్డి (Sumaya Reddy) కూడా వీడియో విడుద‌ల చేశారు. డియ‌ర్ ఉమ సినిమా ప్ర‌మోష‌న్ల‌లో ఉన్న త‌న‌కు కుటుంబ స‌భ్యులు, ఫ్రెండ్స్ నుంచి మెసేజ్‌లు, కాల్స్ వ‌స్తున్నాయ‌ని, తీరా చూస్తే ఎయిర్‌పోర్టు వీడియోపై కొంద‌రు న‌చ్చిన‌ట్లుగా కామెంట్స్ చేస్తూ దుష్ప్ర‌చారం చూసి షాక్ అయ్యాన‌ని ఆవేద‌న‌ వ్య‌క్తం చేశారు. తోపుదుర్తి ప్ర‌కాశ్‌రెడ్డి త‌మ‌కు బంధువు అని, దానిపై కూడా ఇలా విష‌ప్ర‌చారం చేయ‌డం ఏంట‌ని ప్ర‌శ్నించారు. నిజానిజాలు తెలియ‌కుండా అమ్మాయిని అడ్డం పెట్టుకొని రాజ‌కీయాలు చేయొద్దని కోరారు. ఆడ‌వారికి మీరిచ్చే గౌర‌వం ఇదేనా అని ప్ర‌శ్నించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment