నేడు ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్రంగా మారి ఏపీలో పలు జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. అల్పపీడనం వాయవ్య దిశగా ప్రయాణిస్తుందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ అల్పపీడనం ఆగ్నేయ తీరానికి దగ్గరగా వచ్చి, రేపు ఉదయం తమిళనాడులో తీరం దాటే అవకాశముంది.
వర్షాల అంచనాలు
నేడు ఏపీలోని నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో ఈరోజు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. అలాగే దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో రేపు అక్కడక్కడా వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేసింది.
వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షితంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.








