తిరువూరు టీడీపీ (TDP) ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు (Kolikapudi Srinivasa Rao) సంచలన ఛాలెంజ్ చేశారు. ఫిర్యాదు చేసి 10 రోజులు అయినా అధిష్టానం ఇంత వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ జిల్లా (NTR District) లో తిరువూరు ఎమ్మెల్యే (Tiruvuru MLA) నివాసం ఎదుట గిరిజన మహిళలు నిరసనకు దిగారు. టీడీపీకి చెందిన మాజీ ఏఎంసీ చైర్మన్ (AMC Chairman) ఆలవాల రమేశ్‌రెడ్డి (Alavala Ramesh Reddy) ని పార్టీ నుంచి తక్షణమే బహిష్కరించాలని వారు డిమాండ్ చేశారు.
ఎమ్మెల్యే కఠిన హెచ్చరిక.. 48 గంటల్లో రాజీనామా?
ఇటీవల ఓ మహిళపై లైంగిక వేధింపుల (Sexual Harassment) ఆడియో లీక్ కావడం రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు పార్టీ నాయకత్వానికి గట్టి వార్నింగ్ ఇచ్చారు. రమేశ్‌రెడ్డి (Ramesh Reddy)పై చర్యలు తీసుకోకపోతే 48 గంటల్లో తానే రాజీనామా (Resignation) చేస్తానని ప్రకటించారు.
రమేశ్‌రెడ్డి అనే వ్యక్తి ప్రతి రోజూ టీడీపీ ఎంపీ ఆఫీస్‌లోనే కూర్చుంటున్నాడన్నారు. లైంగిక వేధింపుల ఘటనపై ఎంపీకి, జిల్లా అధ్యక్షుడికి, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడికి రమేశ్‌రెడ్డి వ్యవహారం గురించి ఫిర్యాదు చేశానని, అయినా ఇప్పటి వరకు ఎలాంటి యాక్షన్ తీసుకోలేదన్నారు. ఈ వ్యవహారం టీడీపీ (TDP) వర్గాల్లో ఉత్కంఠ రేపుతోంది. పార్టీ అధిష్టానం ఏం నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.