తిరుపతి తిరుమలలో ఇటీవల చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటనపై విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఓ కమిషన్ను ఏర్పాటు చేసింది. రిటైర్డ్ న్యాయమూర్తి సత్యనారాయణ మూర్తి నేతృత్వంలో విచారణ కమిషన్ను ఏర్పాటు చేస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, భక్తులు సిట్టింగ్ జడ్జితో కాకుండా రిటైర్డ్ జడ్జితో విచారణ జరిపించడంపై అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.
భక్తుల అసంతృప్తి..
ఈ విచారణ కమిషన్కు ప్రభుత్వం 6 నెలల గడువును ఇచ్చింది. దీనిపై భక్తులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలు, గాయపడిన భక్తులు తక్షణమే న్యాయం జరిగేలా చూడాలని డిమాండ్ చేస్తున్నారు. విచారణకు దాదాపు ఆరు నెలల సమయం కేటాయించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఏం జరిగింది?
ఇటీవల తిరుమలలో వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల కోసం భారీ భక్తులు తరలిరావడంతో భద్రతా చర్యల లోపం కారణంగా తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు భక్తులు మృతిచెందగా, అనేకమంది భక్తులు గాయపడ్డారు. దీనిపై స్పందించిన ప్రభుత్వం మృతులకు పరిహారం సైతం అందజేసింది. తొక్కిసలాట ఘటనపై సత్వర విచారణ అవసరం అని భక్తులు భవిస్తున్నారు.