కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరస్వామి కొలువైన కొండపై షాకింగ్ స్కామ్ వెలుగులోకి వచ్చింది. నకిలీ ఐడీ కార్డులతో వీఐపీ బ్రేక్ దర్శనాల టికెట్లను అక్రమంగా విక్రయిస్తున్న ఒక దళారిని తిరుమలలో పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి విలువూన సమాచారాన్ని సేకరించారు.
వివరాల ప్రకారం.. నిందితుడు బ్రహ్మయ్య అనే వ్యక్తి తిరుపతి ఆర్మీ క్యాంటీన్‌లో పనిచేస్తున్నాడు. ఆయన నకిలీ ఆర్మీ అధికారుల ఐడీలు సృష్టించి, రూ.2 వేల విలువ చేసే బ్రేక్ దర్శనం టికెట్లను రూ.40 వేల ధరకు విక్రయిస్తున్నట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది.
విజిలెన్స్ అధికారుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు, దళారిని అదుపులోకి తీసుకున్నారు. భక్తుల నుండి అధిక మొత్తాలు వసూలు చేస్తూ తిరుమల దర్శనాలను దుర్వినియోగం చేస్తున్న వ్యక్తులపై విచారణ కొనసాగుతోంది.







