కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరస్వామి (Sri Venkateswara Swamy) కొలువైన తిరుమల కొండ (Tirumala Hills)పై జరుగుతున్న వరుస ఘటనలు భక్తులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. కొండమీద ట్యాక్సీ డ్రైవర్ల (Taxi Drivers) మధ్య జరిగిన ఘటన ఒకరి ప్రాణాన్ని బలిగొంది. తిరుమల కొండపై ఇటీవల మద్యం, మాంసాహార పదార్థాలు లభించగా, అన్యమత ప్రచారం, మద్యం మత్తులో యువకుడి వీరంగం సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. తాజాగా టీటీడీ గోశాలలో గోమాతల మృతి ఆందోళన కలిగిస్తుండగా, తిరుమలలో జరిగిన మరో సంఘటన భక్తులను ఆందోళనకు గురిచేస్తోంది. తిరుమల కొండపై ఇద్దరు డ్రైవర్ల మధ్య ఘర్షణ ఒకరు మృతి (Died) చెందిన విషయం వెలుగులోకి వచ్చింది.
గత శనివారం (12-04-2025) సాయంత్రం 4.30 గంటలకు తిరుమలలోని రాంభాగీచా బస్ స్టాండ్ (Rambhagicha Bus Stand) లో జీపు డ్రైవర్లు (Jeep Drivers) మధ్య ఘర్షణ జరిగింది. పార్కింగ్ (Parking) విషయంలో తలెత్తిన వివాదం హత్య (Murder) కు దారి తీసింది. మద్యం మత్తులో మదనపల్లికి చెందిన ట్యాక్సీ డ్రైవర్ శివ (Shiva)పై రాజంపేటకు చెందిన జీపు డైవర్లు దాడి చేశారు. సిమెంట్ రాయి (Cement Stone)తో మెడ, ఛాతీ, కడుపుపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. మద్యం మత్తులో డ్రైవర్లు చేసిన దాడిలో శివ తీవ్రంగా గాయపడి తిరుమలలోని అశ్విని ఆస్పత్రి (Ashwini Hospital) లో చేరాడు. అక్కడి డాక్టర్ల సూచనల మేరకు రుయా ఆస్పత్రి (RUYA Hospital) కి తరలించారు. గత మూడు రోజులుగా చికిత్స పొందుతూ సోమవారం సాయంత్రం 6 గంటలకు తుదిశ్వాస (Last Breath) విడిచాడు.
పోలీస్ కేసుతో వెలుగులోకి సంఘటన..
ఈనెల 12వ తేదీ ఈ ఘటన జరగ్గా, తాజాగా మృతుడు శివ తరఫు బంధువుల ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చింది. తన అన్నకు కారణమైన శివప్రసాద్ (Shivaprasad) అలియాస్ పొట్టిశివ, మణి (Mani) అలియాస్ చాపల మణి, గణేష్ (Ganesh) అలియాస్ గనీలను అరెస్టు చేసి తగిన చర్యలు తీసుకోవాలని తిరుమల 2 టౌన్ పోలీసులకు అందించిన ఫిర్యాదులో పేర్కొన్నారు.
టీటీడీ ఏం చేస్తోంది..
మద్యం సేవించి తిరుమల కొండపై తోటి డ్రైవర్‌పై దాడి చేసి హతమార్చడం విమర్శలకు తావిస్తోంది. ఈ ఘటనతో తిరుమలలో భద్రతా వైఫల్యం (Security Lapse) కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోందని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మద్యం సేవించిన వారిని కొండపైకి ఎలా అనుమతిస్తున్నారని భక్తులు ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి ఘటనలు వరుసగా జరుగుతుంటే.. తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి (TTD Board) ఏం చేస్తోందన్న ప్రశ్నతలు భక్తుల నుంచి తలెత్తుతున్నాయి.







