తిరుమలలో భక్తుల రద్దీ.. ద‌ర్శ‌నానికి 18 గంట‌లు

తిరుమలలో భక్తుల రద్దీ.. ద‌ర్శ‌నానికి 18 గంట‌లు

క‌లియుగ దైవం కొలువైన తిరుమల తిరుపతి కొండ‌పై భక్తుల రద్దీ మరోసారి గణనీయంగా పెరిగింది. శ్రీ‌వెంక‌టేశ్వ‌ర‌స్వామి ద‌ర్శ‌నానికి భ‌క్తులు భారీ సంఖ్య‌లో త‌ర‌లివ‌చ్చారు. గురువారం దాదాపు 64,879 మంది శ్రీ‌వారిని ద‌ర్శించుకున్నారు. వీరిలో స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తులు 23,960 మంది కాగా, శ్రీవారి హుండీలో రూ. 4.09 కోట్ల ఆదాయం సమకూరినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులు తెలిపారు. వారాంతాల్లో జరిగే యాత్రల వల్ల కొండ‌పై భ‌క్తుల సంఖ్య పెరిగ‌న‌ట్లుగా అధికారులు వెల్లడించారు.

ఉచిత సర్వదర్శనం కోసం 26 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. వీరి ద‌ర్శ‌నం కోసం సుమారు 18 గంటల సమయం పట్టనునట్లు టీటీడీ అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనానికి సుమారు 5 గంటల స‌మ‌యం, అదే విధంగా రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శనం కోసం సుమారు 4 గంటల సమయం పట్టనునట్లు స‌మాచారం. స‌ర్వ‌ద‌ర్శ‌నం భ‌క్తులు శ్రీ‌వారి ద‌ర్శ‌నానికి 18 గంట‌ల స‌మ‌యం ప‌ట్ట‌నుంది. వీకెండ్స్‌లో ఈ భ‌క్తుల సంఖ్య మ‌రింత పెరిగే అవ‌కాశం ఉంద‌ని అధికారులు భావిస్తున్నారు.

భక్తుల రద్దీని నిర్వహించడానికి టీటీడీ అనేక ఏర్పాట్లు చేసింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్ట్‌మెంట్లతో పాటు, అలిపిరి, శ్రీవారి మెట్టు మార్గాల ద్వారా దివ్య దర్శనం కోసం వచ్చే భక్తులకు టోకెన్లు అంద‌జేస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment