తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)(TTD) పరకామణి (Parakamani) కేసులో ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) హైకోర్టు (High Court) ముఖ్యమైన ఆదేశాలు జారీ చేసింది. పరకామణిలో చోరీ కేసు విచారణలో ఆలస్యం జరగకూడదని, సీఐడీ(CID) తక్షణమే దర్యాప్తు ప్రారంభించి డిసెంబర్ 2 నాటికి విచారణ పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశించింది. పరకామణి నిధుల నిర్వహణలో జరిగిన అవకతవకలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన న్యాయస్థానం, నిందితుడు రవికుమార్ ఆస్తులపై పూర్తి స్థాయి దర్యాప్తు జరపాలని కూడా ఏసీబీ డీజీకి ఆదేశాలు ఇచ్చింది.
కేసు విచారణ సమయంలో లోక్ అదాలత్‌లో రాజీ చేసిన న్యాయమూర్తిపై కూడా తగిన చర్యలు తీసుకోవాలని హైకోర్టు సూచించింది. రవికుమార్(Ravi Kumar) మరియు ఇతర నిందితులపై ఉన్న ఆరోపణలను సాక్ష్యాలతో పరిశీలించి, న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని సీఐడీ అధికారులకు ఆదేశించింది. తదుపరి విచారణను డిసెంబర్ 2కి వాయిదా వేసిన హైకోర్టు, అప్పటికి దర్యాప్తు పూర్తి నివేదికను సమర్పించాలని సీఐడీకి స్పష్టమైన గడువు ఇచ్చింది.








