---Advertisement---

తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ.. ద‌ర్శ‌నానికి ఎన్ని గంట‌లంటే..

తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ.. ద‌ర్శ‌నం ఎన్ని గంట‌లంటే..
---Advertisement---

తిరుమలలో ప్రస్తుతం భక్తుల రద్దీ కొంత తగ్గింది. ఉచిత సర్వ దర్శనానికి కేవలం 1 కంపార్ట్‌మెంట్‌లో మాత్రమే భక్తులు వేచి ఉన్నారు. ఆదివారం నాడు 84,950 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా, 21,098 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి హుండీ ద్వారా భక్తులు రూ. 3.80 కోట్లు కానుకలుగా సమర్పించినట్లు అధికారులు తెలిపారు.

ఉచిత సర్వదర్శనం కోసం 1 కంపార్ట్‌మెంట్‌లో భక్తులు వేచి ఉండగా, దర్శనానికి సుమారు 6 గంటల సమయం పడుతోందని టీటీడీ అధికారులు చెబుతున్నారు. టైమ్ స్లాట్ (SSD) దర్శనం 2 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు, ఈ దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులు 3 గంటల్లో స్వామివారిని దర్శించుకోగలుగుతున్నారు. తిరుమలలో ప్రస్తుతం రద్దీ తక్కువగా ఉండటం వల్ల భక్తులకు స్వామివారి దర్శనం సులభంగా లభిస్తోంది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment