విశాఖపట్నం (Visakhapatnam) లోని ప్రముఖ శారదాపీఠానికి (Sharada Peetham) తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నోటీసులు (Notices) జారీ చేసింది. తిరుమలలో శారదాపీఠం నిర్వహిస్తున్న మఠం భవనాన్ని (Monastery Building) ఖాళీ చేసి తమకు అప్పగించమని (Handover) స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఈ మేరకు న్యాయస్థానం టీటీడీకి అనుకూలంగా తీర్పు వెలువరించగా, ఆ తీర్పును ఆధారంగా చేసుకొని టీటీడీ ఎస్టేట్ విభాగం (TTD Estate Department) నోటీసులు పంపించింది. అందులో 15 రోజుల్లోపు మఠం ఖాళీ చేసి భవనాన్ని తిరిగి అప్పగించాలని స్పష్టం చేశారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక టీటీడీ చైర్మన్ (TTD Chairman) శారదపీఠంపై దృష్టి సారించారు. గత నవంబర్ 18న జరిగిన తొలి బోర్డు సమావేశంలో గోగర్భం డ్యామ్ (Gogarbham Dam) వద్ద విశాఖ శారద పీఠానికి చెందిన నిర్మాణంలో అవకతవకలు జరిగినట్లు ఆరోపిస్తూ TTD అధికారుల కమిటీ నివేదిక ఆధారంగా భవనం లీజు రద్దు (Lease Cancel) చేయాలని పాలకమండలి నిర్ణయించింది. కాగా, టీటీడీ చర్యపై శారదాపీఠం కోర్టును ఆశ్రయించింది. అయితే టీటీడీ బోర్డు నిర్ణయాన్ని సమర్థిస్తూ కోర్టు ఉత్తర్వులిచ్చింది. కోర్టు మార్గదర్శకాల (Court Guidelines) మేరకు 15 రోజుల్లో భవనం ఖాళీ చేసి టీటీడీకి స్వాధీనపరచాలంటూ నోటీసులు జారీ చేసింది.







