ఆసియా కప్ (Asia Cup) ఫైనల్ (Final)లో మెరుపులు మెరిపించిన క్రికెటర్ తిలక్ వర్మ (Tilak Varma) దేశ వ్యాప్తంగా క్రికెట్ అభిమానుల ప్రశంసలు అందుకుంటున్నాడు. ఇదిలా ఉండగా, మ్యాచ్ అనంతరం తాను ధరించిన టోపీ (Cap)ని ప్రేమతో తన సోదరుడిలా భావించే లోకేష్ (Lokesh)కి బహుమతిగా ఇస్తానని ప్రకటించాడు. ఈ బహుమతి గురించి తిలక్ చేసిన ట్వీట్ క్షణాల్లోనే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తిలక్ వర్మ నుంచి ఇంత ప్రత్యేక బహుమతి రావడంపై లోకేష్ స్పందించాడు. తమ్ముడు ఇచ్చిన ఈ బహుమతి తన జీవితంలో చిరస్మరణీయమని లోకేష్ ట్వీట్‌లో పేర్కొన్నాడు. తిలక్‌తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ, ఈ బహుమతిని ఎప్పటికీ కాపాడుకుంటానని తెలిపాడు. త్వరలోనే స్వదేశానికి వచ్చే తిలక్ వర్మ చేతుల మీదుగానే ఈ టోపీని స్వీకరిస్తానని లోకేష్ స్పష్టం చేశాడు. ఆటతో పాటు ఆటగాళ్ల మధ్య ఉన్న ఈ బంధం అభిమానులను ఆకట్టుకుంటోంది.
తిలక్ వర్మ, లోకేష్ ట్వీట్లను టీడీపీ శ్రేణులు షేర్ చేస్తూ, వైరల్ చేస్తున్నారు. గతంలో దుబాయ్ (Dubai)లో జరిగిన టీమిండియా మ్యాచ్ చూసేందుకు వెళ్లిన మంత్రి లోకేష్.. ఆ సమయంలోనే తిలక్ వర్మతో స్నేహం పెంచుకున్నారని టీడీపీ శ్రేణులు అంటున్నారు.





 



