పాన్-ఇండియా స్టార్ ప్రభాస్ (Pan-India Star Prabhas) నటిస్తున్న ‘ది రాజా సాబ్’ (The Raja Saab) సినిమా ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలను క్రియేట్ చేసింది. మారుతి(Maruthi) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ రొమాంటిక్ హారర్-కామెడీ చిత్రం 2026 జనవరి 9న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది. కొన్ని నెలల క్రితం మేకర్స్ విడుదల చేసిన థియేట్రికల్ ట్రైలర్ (Theatrical Trailer) సినిమాపై ఆసక్తిని మరింతగా పెంచింది.
తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమాకు సంబంధించిన రిలీజ్ ట్రైలర్‌ను ప్రీ-రిలీజ్ ఈవెంట్ సందర్భంగా డిసెంబర్ 27న హైదరాబాద్‌లో లాంచ్ చేయనున్నారు. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ కథానాయికలుగా నటిస్తున్నారు.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీ.జీ. విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ ఈ సినిమాను నిర్మించగా, సంగీతాన్ని థమన్ అందిస్తున్నారు. అలాగే సంజయ్ దత్, బొమన్ ఇరానీ, జరీనా వహాబ్, సముద్రఖని, వీటీవీ గణేష్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. విడుదల కాబోయే ట్రైలర్ ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి.









అయ్యన్న రిటైర్మెంట్.. స్పీకర్ సెంటిమెంటా..? జగన్ భయమేనా?