‘ది గర్ల్‌ఫ్రెండ్’ ఆ ఫీల్ మిగిలిపోతుంది.. రష్మికపై దీక్షిత్ శెట్టి ప్రశంసలు!

'ది గర్ల్‌ఫ్రెండ్' ఆ ఫీల్ మిగిలిపోతుంది.. రష్మికపై దీక్షిత్ శెట్టి ప్రశంసలు!

హీరో దీక్షిత్ శెట్టి, రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో రష్మిక మందన్న కథానాయికగా నటించిన ‘ది గర్ల్‌ఫ్రెండ్’ చిత్రం గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. నవంబర్ 7న విడుదల కానున్న ఈ సినిమా గురించి దీక్షిత్ మాట్లాడుతూ, ఈ చిత్రం ప్రేమను మరో కోణంలో చూపించి, ప్రేక్షకుల మనసులో నిలిచిపోయే ‘ఫీల్‌ గుడ్’ సినిమా అవుతుందన్నారు.

‘ది గర్ల్‌ఫ్రెండ్‌’ సినిమాలో రష్మిక పాత్ర పట్ల ఆమె చూపిన ప్యాషన్ అద్భుతమని దీక్షిత్ కొనియాడారు. రష్మికతో కలిసి పనిచేయడం “నిజంగా ఓ అందమైన అనుభవం” అని, ఆమె స్టార్‌డమ్‌ను పక్కనపెట్టి సెట్‌లో అందరితో స్నేహపూర్వకంగా, చాలా సింపుల్‌గా ఉంటుందని తెలిపారు. “తెరపై ఆమెను చూసినప్పుడు రష్మిక కాకుండా, కేవలం భూమ అనే పాత్ర మాత్రమే కనిపిస్తుంది” అని ఆమె నటనను ప్రశంసించారు.

ఈ చిత్రంలో తాను ఒక ‘టాక్సిక్ బాయ్‌ఫ్రెండ్‌’ (విక్రమ్) పాత్ర పోషించానని, ఇది చాలా రియలిస్టిక్‌గా ఉంటుందని దీక్షిత్ చెప్పారు. తన నటనను చూసి అల్లు అరవింద్ గారు ప్రత్యేకంగా ప్రశంసించి, మరో సినిమాకు అడ్వాన్స్ ఇవ్వడం తనకు లభించిన పెద్ద గౌరవం అని దీక్షిత్ ఈ సందర్భంగా పంచుకున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment