నాగచైతన్య(Naga Chaitanya), సాయి పల్లవి (Sai Pallavi) జంటగా నటించిన చిత్రం ‘తండేల్’ ట్రైలర్ (Thandel Trailer)మంగళవారం సాయంత్రం విడుదలైంది. విడుదలైన 14 గంటలు కూడా గడవకముందే సుమారు 6 మిలియన్ల వ్యూస్ సంపాదించింది. చందూ మొండేటి (Chandhu Mondeti) దర్శకత్వంలో బన్నీ వాసు నిర్మించిన ఈ చిత్రం గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో రూపొందింది.
ఈ ట్రైలర్ ప్రేక్షకుల్లో అంచనాలు పెంచింది. ప్రేమ కథతో మొదలై, వేటకు వెళ్లే సంఘటనలతో శ్రీకాకుళం మత్స్యకారుల జీవితాలను ఆవిష్కరిస్తుంది. హీరో వేటకు వెళ్లినప్పుడు అనుకోకుండా పాకిస్తాన్ జలాల్లోకి ప్రవేశించడం, అక్కడ చిక్కుకోవడం, అక్కడ సమస్యలను ఎదుర్కొని ఎలా బయటపడ్డారు అ సన్నివేశాలు థ్రిల్లింగ్‌గా ఉంటాయని ట్రైలర్ స్పష్టంగా చెబుతోంది.
శ్రీకాకుళం యాసలో చైతూ, సాయి పల్లవి
సినిమాను శ్రీకాకుళం బ్యాక్‌డ్రాప్ (Srikakulam Backdrop)లో తెరకెక్కించారు. ఈ చిత్రంలో హీరో, హీరోయిన్ స్థానిక యాసలో మాట్లాడటం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. యాక్షన్ సన్నివేశాలు కూడా భారీగా ఉండేలా డిజైన్ చేసినట్లుగా ట్రైలర్ ద్వారా స్పష్టం అవుతుంది. ఈ చిత్రాన్ని శ్రీకాకుళం ప్రాంతానికి చెందిన మత్స్యకారుల నిజ జీవిత కథ ఆధారంగా రూపొందించారు. సాంగ్స్, గ్లింప్సులు ఇప్పటికే ప్రేక్షకుల ఆదరణ పొందగా, ట్రైలర్ ఆ హైప్‌ను మరింత పెంచింది. ఫిబ్రవరి 7న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.