ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) కూటమి ప్రభుత్వం (Coalition Government) అధికారంలోకి వచ్చి ఏడాది (One Year) పూర్తయింది. ఈ సందర్భంగా సీఎం(CM) చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) “విధ్వంసం నుంచి వికాసం” అనే నినాదంతో ప్రభుత్వ ప్రధాన పథకాలపై విశ్లేషణ చేశారు. ఇందులో ప్రధానంగా “తల్లికి వందనం” (Thalliki Vandanam) పథకాన్ని ప్రస్తావించారు. గత వైసీపీ ప్రభుత్వ (YSRCP Government) గైడ్‌లైన్స్ (Guidelines) ప్రకారమే ఈ పథకాన్ని కొనసాగిస్తున్నామని చెప్పారు. ఈ పథకం కేవలం ఆర్థిక సాయంగా కాకుండా, ప్రతి కుటుంబానికి విద్యా భద్రతను నిర్ధారించే చర్యగా అభివర్ణించారు. ఇది “అమ్మఒడి” (Amma Vodi) మార్గదర్శకాలకు అనుగుణంగా రూపొందించబడిందని చెప్పారు. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా ప్రతి ఒక్కరికి రూ.15,000 చొప్పున ప్రభుత్వం సాయం అందించనుంది.
తల్లికి వందనం పథకం ద్వారా 67,27,164 మంది విద్యార్థులకు (Students) లబ్ధి చేకూరుతుందన్నారు. తల్లి లేని పిల్లలకు తండ్రి లేదా లీగల్ గార్డియన్‌కు ఈ రకం సాయం అందించనున్నట్లు చెప్పారు. అనాథ విద్యార్థుల (Orphan Students) విషయంలో కలెక్టర్ (Collector) నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. గ్రామ/వార్డు సచివాలయాల్లో (Village/Ward Secretariats) లబ్ధిదారుల జాబితాలు అందుబాటులో ఉంటాయని స్పష్టం చేశారు.
అయితే ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన జీవో ప్రకారం, మొత్తం రూ.15వేలలో రూ.2,000 కోత విధించారు. ఇందులో రూ.1,000 పాఠశాల నిర్వహణ కోసం, మరో రూ.1,000 మరుగుదొడ్ల నిర్వహణ నిధిగా కేటాయించారు. ఫలితంగా తల్లుల ఖాతాల్లోకి నేరుగా రూ.13,000 మాత్రమే జమ కానున్నాయి. ఇది పూర్వ ప్రభుత్వం తీసుకున్న విధానాన్నే కొనసాగించడమని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.








