గుంటూరు జిల్లా ఫిరంగిపురంలోని శాంతినగర్‌లో సోమవారం అర్ధరాత్రి తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలేరమ్మ ఆలయానికి చెందిన స్థలాన్ని అదే గ్రామానికి చెందిన చిన్నికృష్ణ కుటుంబం ఆక్రమించినట్లు గ్రామస్థులు ఆరోపించారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం పెరిగి గొడవకు దారితీసింది.
పరిస్థితి అదుపు తప్పి తారాస్థాయికి చేరడంతో గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. అయితే, సంఘటనను మొబైల్‌లో రికార్డు చేస్తున్న యువకుడిపై సీఐ రవీంద్రబాబు దాడి చేసినట్లు స్థానికులు తెలిపారు. శాంతినగర్ లో పోలీసులతో గ్రామస్తుల తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. దాడికి నిరసనగా గ్రామస్థులు పోలీసుల వాహనంపై రాళ్లు రువ్వారు. ఈ ఘటన గ్రామంలో మరింత ఉద్రిక్తతను పెంచింది. దీంతో సీఐ రవీంద్రబాబు గన్ బయటకు తీయడంతో.. సీఐ తీరును నిరసిస్తూ గ్రామస్తులు గుంటూరు రహదారిపై రాస్తారోకో చేపట్టారు.