ప్రపంచవ్యాప్తంగా (Worldwide) ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ (Oscar) 2025 అవార్డుల కోసం ఐదు తెలుగు చిత్రాలు భారతదేశం తరఫున అధికారికంగా ఎంపికయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానుల దృష్టిని ఆకర్షించిన ఈ చిత్రాలు – ‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankranthiki Vasthunnam), ‘కన్నప్ప’ (Kannappa), ‘పుష్ప 2′, (Pushpa) 2’గాంధీ తాత చెట్టు’ (Gandhi Tata Chettu) , మరియు ‘కుబేర’ (Kubera). ఈ చిత్రాలు ఇప్పటికే బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించాయి.
‘సంక్రాంతికి వస్తున్నాం’ వెంకటేష్, అనిల్ రావిపూడి కలయికలో వచ్చిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్, ఇది రూ. 300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.
‘పుష్ప 2’ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం, దీని ‘రీలోడెడ్’ వెర్షన్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.
‘గాంధీ తాత చెట్టు’ సుకుమార్ కూతురు సుకృతి వేణి నటించిన చిన్న చిత్రం, ఇది స్వచ్ఛమైన కథతో ప్రేక్షకులకు దగ్గరైంది.
‘కుబేర’ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్, నాగార్జున నటించిన చిత్రం. ధనవంతులు, పేదవారి మధ్య సంఘర్షణ ఈ సినిమా కథాంశం.
‘కన్నప్ప’ మంచు విష్ణు హీరోగా నటించిన భక్తి చిత్రం, ఇందులో మోహన్‌లాల్, ప్రభాస్ వంటివారు కీలక పాత్రలు పోషించారు.








