50 వేల కోట్లు స్వాహా యత్నం! రేవంత్‌ ప్రభుత్వంపై బీఆర్‌ఎస్‌ ఫైర్‌

50 వేల కోట్లు స్వాహా యత్నం! రేవంత్‌ ప్రభుత్వంపై బీఆర్‌ఎస్‌ ఫైర్‌

తెలంగాణలో రేవంత్‌రెడ్డి (Revanth Reddy) ప్రభుత్వం రూ.50 వేల కోట్ల భారీ ‘పవర్‌ స్కామ్‌’ (Power Scam) కు పాల్పడుతోందని బీఆర్‌ఎస్‌(BRS) ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్‌రావు (Harish Rao) తీవ్ర ఆరోపణలు చేశారు. గత పదేళ్లలో అన్ని వర్గాల సంక్షేమానికి చిరునామాగా ఉన్న తెలంగాణను కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) భారీ కుంభకోణాల కేంద్రంగా మార్చిందని ఆయన మండిపడ్డారు. ముఖ్యంగా, రామగుండం (Ramagundam), పాల్వంచ (Palvancha), మక్తల్‌ (Makthal)లలో ప్రతి 800 మెగావాట్ల సామర్థ్యం కలిగిన థర్మల్‌ పవర్‌ ప్లాంట్ల (Thermal Power Plants) నిర్మాణ వ్యయాన్ని అసాధారణంగా పెంచి, దాదాపు రూ.15 వేల నుంచి రూ.20 వేల కోట్ల మేర భారీ స్కామ్‌కు పాల్పడుతోందని ఆరోపించారు.

ఈ ప్రాజెక్టుల ద్వారా 30 నుంచి 40 శాతం కమీషన్లు దండుకునేందుకు రంగం సిద్ధం చేసుకున్నారని ఆయన దుయ్యబట్టారు. గతంలో యాదాద్రి, భద్రాద్రి ప్లాంట్లను తక్కువ వ్యయంతో నిర్మించిన విషయాన్ని గుర్తు చేస్తూ, ఇప్పుడు ఒక్కో మెగావాట్‌ ఉత్పత్తికి రూ.14 కోట్లు పెట్టడం వెనుక ఉన్న మర్మమేంటని హరీశ్‌రావు ప్రశ్నించారు.
ఈ మొత్తం వ్యవహారంలో రేవంత్‌ ప్రభుత్వం ప్రతీ చర్య వెనుక ‘కమీషన్‌’ అనే మిషన్‌ దాగి ఉందని ఆయన ఎద్దేవా చేశారు.

2400 మెగావాట్ల విద్యుత్‌ను యూనిట్‌కు రూ.4.12లకే సరఫరా చేస్తామని ఎన్‌టీపీసీ (NTPC) చెబుతున్నప్పటికీ, ప్రభుత్వం ఆ ఆఫర్‌ను తిరస్కరించి, యూనిట్‌కు రూ.8 నుంచి రూ.10 ఖర్చు చేయడానికి సిద్ధమవుతోందని ఆరోపించారు. అంతేకాకుండా, లాభాలు తెస్తున్న విద్యుత్‌ పంపిణీ సంస్థలను (డిస్కమ్‌లను) ప్రైవేటీకరణ చేసి కమీషన్లు దండుకునేందుకు ప్రయత్నిస్తున్నారని, ఇది కేంద్రంలోని బీజేపీ డైరెక్షన్‌లోనే రేవంత్‌రెడ్డి యాక్షన్‌ చేస్తున్నారని విమర్శించారు. బీఆర్‌ఎస్‌ ఈ కుంభకోణాలపై న్యాయ పోరాటం చేస్తుందని హరీశ్‌రావు హెచ్చరిస్తూ, త్వరలోనే అండర్‌గ్రౌండ్‌ కేబుల్‌, పంప్డ్‌ స్టోరేజీ స్కామ్‌లతో సహా మరిన్ని ఆధారాలను బయటపెడతామని ప్రకటించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment