---Advertisement---

ఎమ్మెల్సీల ఎన్నిక ఏక‌గ్రీవ‌మేనా..?

ఎమ్మెల్సీ ఎన్నిక ఏకగ్రీవం కానుందా?
---Advertisement---

తెలంగాణలో ఎమ్మెల్సీ (MLC) ఎన్నికల నామినేషన్ల దాఖలుకు నేటితో గడువు ముగియ‌నుంది. రాష్ట్ర రాజకీయాల్లో ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. మొత్తం ఐదు ఎమ్మెల్సీ స్థానాల కోసం కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీల మధ్య ఆసక్తికర పోటీ నెలకొంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి నలుగురు అభ్యర్థులు.. అద్దంకి దయాకర్, విజయశాంతి, శంకర్ నాయక్, సీపీఐ అభ్యర్థి సత్యం పోటీలో నిలిచారు. మరోవైపు బీఆర్‌ఎస్ (BRS) పార్టీ నుంచి దాసోజు శ్రవణ్ ఏకైక అభ్యర్థిగా బరిలోకి దిగారు.

కాంగ్రెస్ పార్టీ ఎంపిక చేసిన అభ్యర్థుల నామినేషన్ పత్రాలను బలపరుస్తూ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, అడ్లూరి లక్ష్మణ్‌లు ఎమ్మెల్యేల సంతకాలను సేకరించారు. నామినేషన్ పత్రాల పరిశీలన అనంతరం అధికారికంగా అభ్యర్థుల జాబితాను ప్రకటించనున్నారు.

ఏకగ్రీవ ఎన్నికకు అవకాశమా?
మొత్తం ఐదు స్థానాల్లో పోటీ కొనసాగుతుండగా, కాంగ్రెస్ నుంచి నలుగురు, బీఆర్‌ఎస్ నుంచి ఒక అభ్యర్థి మాత్రమే బరిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ ఎన్నిక ఏకగ్రీవంగా పూర్తి కానున్న అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎలాంటి అవాంతరం లేకపోతే, నామినేషన్ పత్రాల పరిశీలన అనంతరం అధికారికంగా విజేతలను త్వరలో ప్రకటించనున్నారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment