టీడీపీ ఎమ్మెల్యే వ్యాఖ్యలపై బీజేపీ ఎమ్మెల్యే ఫైర్

టీడీపీ ఎమ్మెల్యే వ్యాఖ్యలపై బీజేపీ ఎమ్మెల్యే ఫైర్

భగవద్గీత గురించి టీడీపీ ఎమ్మెల్యే, టీటీడీ ట్రస్ట్ బోర్డు సభ్యుడు ఎంఎస్ రాజు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఎమ్మెల్యే వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా, దీనిపై హిందూధర్మ పరిరక్షకులు, బీజేపీ నేతలు తీవ్రంగా స్పందిస్తున్నారు.

ఎంఎస్ రాజు ఓ బహిరంగ సభలో మాట్లాడుతూ.. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రూపొందించిన భారత రాజ్యాంగం ఈ దేశంలోని ప్రజలందరికీ హిందువులకు భగవద్గీత కంటే, ముస్లింలకు ఖురాన్ కంటే, క్రైస్తవులకు బైబిల్ కంటే పవిత్రమైనదని ఆయన వ్యాఖ్యానించారు. “బైబిల్ వల్ల మన జీవితాలు మారలేదు, భగవద్గీత వల్ల మెరుగుపడలేదు, ఖురాన్ లేదా రంజాన్ ముస్లింల విధిని మార్చలేదు. భారత రాజ్యాంగం వల్లనే ప్రజల విధి మారిపోయిందన్నారు.

అయితే ఆయన మాట్లాడిన మాటలతో హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ విషయంపై తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. భవద్గీతపై ఆయన చేసిన కామెంట్లను తీవ్ర స్థాయిలో ఖండించారు. వెంటనే ఆయన్ను టీటీడీ బోర్డు మెంబర్ నుంచి, పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

ఎంఎస్ రాజుకు హిందూ సంప్రాదాయాలపై నమ్మకం లేదని.. ఆయన అన్నారు. టీటీడీ మెంబర్లను నియమించేటపుడు.. వారికి హిందూమతం పట్ల, భవద్గీత పట్ల , హిందూ సాంప్రదాయల పట్ల గౌరవం ఉందో లేదో.. ఒకటికి రెండుసార్లు పరీక్షించాలని రాజాసింగ్ సీఎం చంద్రబాబుని కోరారు.

Join WhatsApp

Join Now

Leave a Comment