మద్యం ప్రియులకు తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) గుడ్ న్యూస్ చెప్పింది. ఇన్స్టంట్ కాఫీ షాపుల తరహాలో ఇన్స్టంట్ బీర్ కేఫ్ (Instant Beer Cafe) లను ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. నగరాల్లో ప్రతి 5 కి.మీ.లకు, జిల్లాల్లో 30 కి.మీ.లకు ఒక మైక్రో బ్రూవరీ (Microbrewery) అనుమతించాలని ఎక్సైజ్ శాఖ (Excise Department) నిర్ణయించింది. ఇప్పటికే నిబంధనల సవరణ ప్రక్రియ ప్రారంభమై, త్వరలో నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది.
100 మైక్రో బ్రూవరీల ఏర్పాటు లక్ష్యం
ప్రస్తుతం తెలంగాణలో ఆరు ప్రధాన బ్రూవరీలు (Six Major Breweries) ఉన్నాయి, వీటి ద్వారా ఏటా 6,500 లక్షల బీర్ కేసులు ఉత్పత్తి అవుతున్నాయి. హైదరాబాద్ (Hyderabad) లోనే 2,500 లక్షల కేసులు అమ్ముడవుతున్నాయి. ఈ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ ఏడాది కనీసం 100 మైక్రో బ్రూవరీలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ప్రణాళిక రూపొందిస్తోంది.
ప్రతి 13,000 మందికి ఒక మైక్రో బ్రూవరీ వచ్చేలా ఎక్సైజ్ శాఖ నిబంధనలను సవరిస్తోంది. ప్రస్తుతం మైక్రో బ్రూవరీల లైసెన్స్ ఫీజు రూ.3 లక్షలు ఉండగా, దాన్ని రూ.5 లక్షలకు పెంచే అవకాశం ఉంది. అలాగే, 1,000 లీటర్ల వరకు తాజా బీర్ ఉత్పత్తి చేసే స్థాయిలో బ్రూవరీలను అనుమతించనున్నట్లు సమాచారం. ఈ కొత్త నిర్ణయంతో మద్యం వ్యాపారులకు కొత్త అవకాశాలు లభిస్తాయి. అయితే, ఇది ఆరోగ్యంపై, సమాజంపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే అంశంపై విస్తృత చర్చ మొదలైంది.








