దిల్‌సుఖ్‌నగర్ పేలుళ్ల కేసు.. ఐదుగురికి ఉరిశిక్ష

దిల్‌సుఖ్‌నగర్ పేలుళ్ల కేసు.. ఐదుగురికి ఉరిశిక్ష

హైదరాబాదు (Hyderabad) లో 2013లో జరిగిన దిల్‌సుఖ్‌నగర్ (Dilsukhnagar) జంట పేలుళ్ల (Twin Blasts) కేసులో తెలంగాణ హైకోర్టు (Telangana High Court) కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసులో ప్రధానంగా ఉన్న‌ ఐదుగురు నిందితులకు (Five Accused) హైకోర్టు ఉరిశిక్ష (Death Penalty) విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది. గతంలో జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) ఫాస్ట్‌ట్రాక్ ఇచ్చిన తీర్పును స‌వాల్ చేస్తూ నిందితులు తెలంగాణ హైకోర్టులో అప్పీల్‌కు వెళ్లారు. ఎన్ఐఏ తీర్పును ర‌ద్దు చేయాల‌ని కోరారు. హైకోర్టు నిందితుల పిటీష‌న్‌ను తిర‌స్క‌రించింది (Dismissed). ఎన్ఐఏ ఫాస్ట్ ట్రాక్ కోర్టు (NIA-Fast-Track Court) ఇచ్చిన తీర్పును సమర్థించిన హైకోర్టు, దాన్ని యథాతథంగా కొన‌సాగించాల‌ని సూచించింది.

దిల్‌సుఖ్‌న‌గ‌ర్‌ బాంబు పేలుళ్ల ఘటనలో మొత్తం 18 మంది ప్రాణాలు కోల్పోగా, 131 మంది తీవ్రంగా గాయపడ్డారు. దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం సృష్టించిన ఈ ఘటనకు సంబంధించిన ప్ర‌ధాన కుట్ర‌దారుడు రియాజ్ భత్కల్ పరారీలో ఉన్నట్లు గుర్తించారు. అతను ఇప్పటికీ పోలీసులకు చిక్కకపోవడం ఆందోళన కలిగిస్తోంది. కాగా, తెలంగాణ హైకోర్టు తీర్పు న్యాయ వ్యవస్థపై ప్రజల నమ్మకాన్ని బలపరిచే విధంగా ఉందని న్యాయవాదులు అభిప్రాయపడుతున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment