తెలంగాణలో పార్టీ (Telangana Party) మారిన పది మంది ఎమ్మెల్యేల (MLAs’) అనర్హత (Disqualification) పిటిషన్లపై (Petitions) సుప్రీం కోర్టు (Supreme Court) గురువారం (జులై 31) కీలక తీర్పు వెల్లడించింది. తెలంగాణ (Telangana) అసెంబ్లీ స్పీకర్ (Assembly Speaker) ఈ పిటిషన్లపై మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. గతంలో తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును కొట్టివేసిన సుప్రీం కోర్టు, ఈ విషయంలో న్యాయస్థానం నేరుగా అనర్హత వేటు వేయాలన్న పిటిషనర్ల విజ్ఞప్తిని తిరస్కరించింది.
భారత ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్ (B.R. Gavai), ఫిరాయింపు పిటిషన్లను సంవత్సరాల తరబడి పెండింగ్‌లో ఉంచడం సమంజసం కాదని తేల్చిచెప్పారు. న్యాయస్థానం విచారణ ప్రారంభించిన తర్వాతే స్పీకర్ ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేశారని, అది సరికాదని వ్యాఖ్యానించారు. పదో షెడ్యూల్ ఉద్దేశాలు నెరవేరుతున్నాయా అని పార్లమెంట్ ఆలోచించాలని, ఆలస్యం చేసే వ్యూహాలు సరికాదని సీజేఐ (CJI) స్పష్టం చేశారు.
పార్టీ ఫిరాయింపులకు పూర్తి అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉందని కోర్టు సూచించింది. ఎమ్మెల్యేలు విచారణను ఆలస్యం చేసేందుకు ప్రయత్నిస్తే, స్పీకర్ తగిన చర్యలు తీసుకోవచ్చని సుప్రీం కోర్టు తేల్చిచెప్పింది. “అపరేషన్ సక్సెస్, పేషెంట్ డైడ్” (“Operation Success, Patient Died”) అనే సూత్రం ఇక్కడ వర్తించకూడదని ధర్మాసనం అభిప్రాయపడింది.
2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కారు గుర్తుపై విజయం సాధించిన ఎమ్మెల్యేలు.. దానం నాగేందర్, తెల్లం వెంకట్రావ్, కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాస్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, కాలే యాదయ్య, ప్రకాశ్ గౌడ్, అరికెపూడి గాంధీ, గూడెం మహిపాల్ రెడ్డి, సంజయ్ కుమార్ అధికార కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని పలువురు బీఆర్ఎస్ న్యాయస్థానాలను ఆశ్రయించింది.








