కాంగ్రెస్ పార్టీ కొత్త ప్రధాన కార్యాలయం ‘ఇందిరా భవన్’ను ఈరోజు (జనవరి 15) పార్టీ అధినేత్రి సోనియా గాంధీ గ్రాండ్‌గా ప్రారంభించనున్నారు. కాంగ్రెస్ చరిత్రలో ఇది ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలవనుంది. గత 50 ఏళ్లుగా ఢిల్లీలోని 24, అక్బర్ రోడ్ కార్యాలయం పార్టీ కార్యకలాపాలకు కేంద్రంగా ఉంది. ఇప్పుడు, 9-ఎ కోట్ల రోడ్ వద్ద ఉన్న కొత్త కార్యాలయం, అధునాతన సౌకర్యాలు, ఆధునిక డిజైన్‌తో నిర్మించారు. ఈ భవనం నేడు సోనియా చేతుల మీదుగా ప్రారంభం కానుంది.
ప్రముఖుల హాజరు
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకులు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి మరియు, పలు రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు, ఇతర ప్రముఖ నేతలు పాల్గొంటారు. ఇది కేవలం ఒక కార్యాలయ ప్రారంభం మాత్రమే కాదు, పార్టీ శ్రేణులకు కొత్త ఉత్తేజాన్ని అందించే సందర్భం కూడా అని పలువురు అభిప్రాయపడుతున్నారు.