ఈ నెల 30 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

ఈ నెల 30 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

తెలంగాణ (Telangana) అసెంబ్లీ సమావేశాలు (Assembly Sessions) ఈ నెల 30 నుంచి ప్రారంభం కానున్నాయి. మూడు రోజుల పాటు జరగనున్న ఈ సమావేశాల్లో ప్రధానంగా కాళేశ్వరం ప్రాజెక్టు  (Kaleshwaram Project)పై కమిషన్ నివేదిక (Commission Report)పై చర్చించనున్నారు. ఈసారి సమావేశాలు హీట్ పుట్టించేలా ఉండొచ్చని రాజకీయ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. సమావేశాల నిర్వహణకు అసెంబ్లీ సిబ్బందికి ఇప్పటికే ఆదేశాలు జారీ అయ్యాయి.

కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపై చర్చ
తెలంగాణ క్యాబినెట్ ఇటీవల ఆమోదించిన కాళేశ్వరం కమిషన్ నివేదికపై ఈ సమావేశాల్లో సమగ్ర చర్చ జరగనుంది. దాదాపు 600 పేజీలకు పైగా ఉన్న ఈ నివేదికను అసెంబ్లీ సభ్యులందరికీ అందజేస్తారు. నివేదికలోని అంశాలపై అన్ని పార్టీల అభిప్రాయాలను తీసుకుని, పూర్తిస్థాయిలో చర్చించిన తర్వాత తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ చర్చల ఆధారంగా ప్రభుత్వం తదుపరి కార్యాచరణను నిర్ణయించుకుంటుంది

Join WhatsApp

Join Now

Leave a Comment