ఆసియా కప్ కోసం దుబాయ్ చేరుకున్న భారత జట్టు..

ఆసియా కప్ కోసం దుబాయ్ చేరుకున్న భారత జట్టు..

ఆసియా కప్ (Asia Cup) T20 2025లో పాల్గొనేందుకు భారత జట్టు(India Team) శుక్రవారం దుబాయ్(Dubai) చేరుకుంది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, శుభ్మాన్ గిల్, ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్తో పాటు, స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya) కూడా దుబాయ్లోని ICC అకాడమీ గ్రౌండ్‌లో కనిపించారు. అయితే, జట్టు రాక కంటే, హార్దిక్ పాండ్యా కొత్త లుక్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

సెప్టెంబర్ 9న ప్రారంభమై సెప్టెంబర్ 28 వరకు జరిగే ఈ టోర్నమెంట్‌లో, భారత్ తన తొలి మ్యాచ్‌ను సెప్టెంబర్ 10న UAEతో ఆడనుంది. ఆ తర్వాత సెప్టెంబర్ 14న పాకిస్తాన్‌ (Pakistan)తో, సెప్టెంబర్ 19న ఒమన్‌ (Oman)తో తలపడుతుంది.

డు. అంతేకాకుండా, తన జుట్టు మొత్తానికి శాండీ బ్లాండ్ రంగు వేయించుకోవడం అందరి దృష్టిని ఆకర్షించింది.

టోర్నమెంట్ వివరాలు:
ఆసియా కప్ 2025లో గ్రూప్-A లో భారత్, పాకిస్తాన్, ఒమన్, UAE జట్లు ఉన్నాయి. గ్రూప్-B లో శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, హాంకాంగ్ ఉన్నాయి. గ్రూప్ దశలో అన్ని జట్లు ఒకదానితో ఒకటి తలపడతాయి. ఒకవేళ భారత్, పాకిస్తాన్ సూపర్-4 దశకు చేరుకుంటే, సెప్టెంబర్ 21న మరోసారి ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ టోర్నమెంట్ ఫైనల్ సెప్టెంబర్ 28న ఉంటుంది. ఒకవేళ భారత్, పాకిస్తాన్ ఫైనల్ చేరితే, ఈ టోర్నమెంట్‌లో వారి మధ్య ఇది మూడవ మ్యాచ్ అవుతుంది.

ఆసియా కప్ 1984లో ప్రారంభం కాగా, ఇప్పటివరకు 16 సార్లు జరిగింది. ఇందులో భారత్ అత్యధికంగా 8 సార్లు గెలిచి అగ్రస్థానంలో ఉంది. శ్రీలంక 6 సార్లు, పాకిస్తాన్ 2 సార్లు విజేతలుగా నిలిచాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment