‘‘తెలియకనే రీల్స్ చేశా’’.. ఉపాధ్యాయురాలు గౌతమి

‘‘తెలియకనే రీల్స్ చేశా’’.. ఉపాధ్యాయురాలు గౌతమి

Summarize with AI

మామిళ్లగూడెం (Mamilagudem) హైస్కూల్‌ (High School) ఉపాధ్యాయురాలు (Teacher) భూక్య గౌతమి రాథోడ్‌ (Bhukya Gauthami Rathod)ను విద్యాశాఖ అధికారులు సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వ ఉద్యోగంలో ఉండగానే ప్రైవేట్‌ విద్యా సంస్థల (Private Educational Institutions) ప్రమోషన్‌కు సంబంధించిన యాడ్స్ చేశారన్న కారణంతో ఈ చర్య తీసుకున్నారు. సస్పెన్షన్‌పై గౌతమి తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. తనకు తెలియకనే రీల్స్ (Reels) చేశానని, మొదటిసారి ప్రమోషన్ చేసినప్పుడు చేయకూడదని ఎవరైనా హెచ్చరించి ఉంటే బాగుండేదని కన్నీటి పర్యంతమయ్యారు. ప్రభుత్వ పాఠశాలకు వ్యతిరేకంగా తాను ఎప్పుడూ పని చేయలేదని వాపోయారు.

‘‘సైనికుల సంక్షేమం కోసం నిధులు కేటాయిస్తున్నామని పిలిస్తేనే నేను వెళ్లాను. మా గవర్నమెంట్‌ స్కూల్‌కు అన్యాయం చేయను. నన్ను తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు. నేనేమైనా హత్యలు చేశానా? గంజాయి లాంటి వాటిని అమ్మానా?’’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విధంగా ట్రోలింగ్‌ జరుగుతుంటే మనస్థాపానికి లోనవుతున్నానని, తన సబ్జెక్టుకు సంబంధించిన రీల్స్ తప్ప మరేదీ చేయలేదని చెప్పారు. విధి నిర్వహణకు వ్యతిరేకంగా తాను ఎలాంటి రీల్స్ చేయలేదని, ఈ రీల్ చేయవచ్చో లేదో కూడా తనకు తెలియదని గౌతమి తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment