తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party)కి ఓటు(Vote) వేస్తే నాశనమైపోతారు అంటూ టీడీపీ కార్యకర్త (TDP Worker) ఆవేదన వ్యక్తం చేస్తూ ఓ వీడియో విడుదల చేశాడు. నమ్మి తెలుగుదేశం పార్టీకి ఓటు వేస్తే.. సొంత పార్టీ నేతలే తనను వేధిస్తున్నారని తన పసిబిడ్డను ఎత్తుకొని కన్నీరు పెట్టుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
వివరాల్లోకి వెళితే.. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం రామాపురం గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త దినేష్ (Dinesh) రెండు వీడియోలు విడుదల చేశాడు. ఆ వీడియోల్లో తన పసిబిడ్డను చేతిలో ఎత్తుకొని కనిపించిన దినేష్, తనను సొంత పార్టీ నేతలే వేధిస్తున్నారని (Harassing), పోలీసులు(Police) అక్రమంగా నిర్బంధించి చిత్రహింసలు పెట్టారని ఆరోపించాడు. తాను ఏ తప్పు చేయకపోయినా, ఎటువంటి ఎఫ్ఐఆర్(FIR) లేదా ఫిర్యాదు పత్రం చూపించకుండా పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్లి అత్యంత దారుణంగా దాడి చేసి, అసభ్యకరంగా దూషించారని ఆవేదన వ్యక్తం చేశాడు.
“నేను తెలుగుదేశం పార్టీకే ఓటు వేసా, కానీ నాకు న్యాయం జరగలేదు. ఎవరూ తెలుగుదేశం పార్టీకీ ఓటు వేయొద్దు, నాశనమైపోతారు” అంటూ కన్నీరు పెట్టుకున్నాడు. తన భార్య సుభద్ర, కుమార్తె సహస్ర పేర్లను ప్రస్తావిస్తూ, టీడీపీ నేతలు యువరాజులు నాయుడు (Yuvarajulu Naidu), దొరబాబు చౌదరి (Dorababu Choudhary), గణపతినాయుడు (Ganapathi Naidu) వల్లే తమ ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయని తెలిపారు. “వాళ్లు పోలీస్ స్టేషన్లో చిత్రహింసలు పెట్టించారు.. నేను టీడీపీకే ఓటు వేసినా కూడా ఇంత అన్యాయం జరిగింది” అంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు.
ఈ వీడియో బయటకు రావడంతో స్థానిక రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ మొదలైంది. పార్టీ అంతర్గత విభేదాలు బయటపడుతుండటమే కాక, నాయకులు తమ కార్యకర్తలపై ఎలాంటి వైఖరితో ఉన్నారో తేటతెల్లమవుతోందని విమర్శలు వినిపిస్తున్నాయి. దినేష్ వీడియోపై పోలీసులు ఇంకా అధికారిక స్పందన ఇవ్వలేదు. అయితే, ఆయన చేసిన ఆరోపణలు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా వైరల్ అవుతున్నాయి.
బ్రేకింగ్ న్యూస్
— Telugu Feed (@Telugufeedsite) October 14, 2025
టీడీపీకి ఓటేస్తే నాశనమైపోతారు.. – కార్యకర్త సెల్ఫీ వీడియో
చిత్తూరు జిల్లా పూతలపట్టులో టీడీపీ నేతలు వేధిస్తున్నారని ఆవేదన
స్టేషన్లో చిత్రహింసలు పెట్టారు.. నేను టీడీపీకే ఓటువేశా.. న్యాయం జరగలేదు
టీడీపీ నాయకులు యువరాజులునాయుడు, దొరబాబు చౌదరి, గణపతినాయుడు… pic.twitter.com/x5c3d6d3ub








