అధికార తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party)కి చెందిన ఎమ్మెల్యే రాసలీలల వీడియోను ప్రతిపక్ష వైసీపీ(YSRCP) బయటపెట్ఇటంది. గతంలో కార్పొరేటర్‌గా పోటీ చేసిన మహిళతో గుంటూరు ఈస్ట్ టీడీపీ ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ (Naseer Ahmad) వీడియోను వైసీపీ లీక్ చేసింది. మహిళతో ఎమ్మెల్యే నసీర్ వీడియో కాల్ మాట్లాడుతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా హల్‌చల్ చేస్తోంది. దీనిపై ప్రతిపక్ష వైసీపీ స్పందిస్తూ “చంద్రబాబు (Chandrababu) ‘కామ’ (Lust) పార్టీ సిత్రాలు (Party Scenes)” అంటూ తీవ్రంగా విమర్శించింది.
గతంలో టీడీపీ కార్పొరేటర్ (TDP Corporator) పదవికి పోటీ చేసి ఓడిపోయిన మహిళ(Women)కి వీడియో కాల్(Video Call) చేసిన నసీర్ అహ్మద్.. ఆ మహిళతో అసభ్యకరంగా సైగలు చేస్తూ మాట్లాడినట్లుగా స్పష్టంగా తెలుస్తోంది. ట్రైన్‌లో వెళ్తున్న మహిళకు తన ఆఫీసు నుండి వీడియో కాల్ చేశారు. వీడియో కాల్‌లో అత్యంత జుగుప్సాకరమైన చేష్టలు కనిపించాయి. ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ ప్రవర్తనపై మహిళా సంఘాలు మండిపడుతున్నాయి. వెంటనే నజీర్ అహ్మద్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. మీ టీడీపీ ఎమ్మెల్యేలకి మీరు నేర్పిన సంస్కారం ఇదేనా చంద్రబాబూ? లోకేష్? అంటూ వైసీపీ పోస్టు చేసింది.
ఇటీవల బయటపడుతున్న టీడీపీ నాయకుల ఆగడాలపై వైసీపీ తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది. గతంలో సత్యవీడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం మహిళతో నగ్నంగా ఉన్న వీడియోలు బయటపడ్డాయి. అదే విధంగా హిందూపురంలో టీడీపీ నాయకుడు యుగంధర్ అలియాస్ చింటు ఒక ముస్లిం మహిళను ఉద్యోగం పేరుతో వేధించిన ఘటనలను వైసీపీ ప్రస్తావించింది. అలాగే, ఒక అమ్మాయి స్కూల్ అడ్మిషన్ కోసం ఒంటరి మహిళను వేధించిన టీడీపీ నాయకుడి ఘటనను కూడా హైలైట్ చేసింది. ఈ ఆరోపణలు ఒక్కొక్కటిగా బయటకు వస్తుండటంతో, టీడీపీ నాయకత్వంపై ఒత్తిడి పెరుగుతోంది, ఈ వివాదాలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరింత ఉద్రిక్తతను సృష్టిస్తున్నాయి.
🚨 #CBNKamaParty
— YSR Congress Party (@YSRCParty) August 4, 2025
చంద్రబాబు ''కామ'' పార్టీ సిత్రాలు….!
టీడీపీ ఎమ్మెల్యే రాసలీలలు బట్టబయలు.
గతంలో టీడీపీ కార్పొరేటర్ పదవికి పోటీ చేసి ఓడిపోయిన మహిళకి వీడియో కాల్ చేసి అసభ్యకరంగా సైగలు చేస్తూ మాట్లాడిన గుంటూరు తూర్పు టీడీపీ ఎమ్మెల్యే నసీర్ అహ్మద్
బాధితురాలు ట్రైన్‌లో… pic.twitter.com/S37FRfW6wW