ప‌సిపాప‌ను పొద‌ల్లోకి తీసుకెళ్లి.. తునిలో టీడీపీ వృద్ధ నేత‌ కీచక బాగోతం.. (Video)

ప‌సిపాప‌ను పొద‌ల్లోకి తీసుకెళ్లి.. తునిలో టీడీపీ వృద్ధ నేత‌ కీచక బాగోతం..

కాకినాడ జిల్లా (Kakinada District) తుని()లో అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన వృద్ధుడి కీచ‌క బాగోతం క‌ల‌క‌లం సృష్టిస్తోంది. తుని (Tuni)రూరల్ పరిధిలోని 2వ వార్డులో ఘోర సంఘటన చోటుచేసుకుంది. మైన‌ర్ బాలిక‌ (Minor Girl)కు మాయ‌మాట‌లు చెప్పి స‌పోట తోట‌లోకి తీసుకెళ్లి అఘాయిత్యానికి య‌త్నించాడు. ఈ అమానుష ఘ‌ట‌న రాష్ట్ర వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టిస్తోంది. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.

వివ‌రాల్లోకి వెళితే..
తుని రూర‌ల్ ప్రాంతానికి చెందిన ఓ మైన‌ర్ బాలిక జగన్నాథగిరి గురుకుల పాఠశాలలో 8వ తరగతి చదువుతుంది. హాస్టల్‌లో చదువుకుంటున్న ఆ బాలికను టీడీపీ నేత తాటిక నారాయణరావు (Thatik) బ‌య‌ట‌కు తీసుకువ‌చ్చాడు. మార్గ‌మ‌ధ్యంలోని హంసవరం మండలంలోని సపోటా తోటల్లోకి తీసుకెళ్లి అత్యాచారానికి య‌త్నించాడు. ఇది గ‌మ‌నించిన‌ అక్కడి తోట యజమాని నారాయ‌ణ‌రావును ప్ర‌శ్నించ‌డంతో వృద్ధుడి కిరాతక చేష్టలు బహిర్గతమయ్యాయి.

కీచ‌క టీడీపీ నేత‌ను తోట య‌జమాని ప్రశ్నించగా “నేనెవరో తెలుసా… టీడీపీ(TDP) కౌన్సిలర్‌ని” అంటూ బెదిరించాడు. , బాలికను స్కూటీపై ఎక్కించుకుని పరారయ్యాడు. తోట య‌జ‌మాని తీసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆ ప్రాంతంలో కలకలం రేగింది. ఈ ఘటనపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తుని గురుకుల పాఠశాల ఎదుట బాలిక తల్లిదండ్రులు, బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తూ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఈ వీడియో వైరల్ అయిన వెంటనే స్థానికులు నారాయణరావును పట్టుకొని దేహశుద్ధి చేశారు. అనంతరం సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని బాలిక బంధువుల ఫిర్యాదు మేరకు నారాయణరావును అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనతో తుని ప్రాంత ప్రజలు, రాజకీయ వర్గాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ చిన్నారుల భద్రతపై ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment