“నా కోరిక తీర్చ‌క‌పోతే నీ ఉద్యోగం తీసేయిస్తా.. ప్ర‌భుత్వం మాది”

"నా కోరిక తీర్చ‌క‌పోతే నీ ఉద్యోగం తీసేయిస్తా.. ప్ర‌భుత్వం మాది"

అంగన్వాడీ (Anganwadi) కార్యకర్త (Worker) ను కులం (Caste) పేరుతో దూషించ‌డ‌మే కాకుండా.. త‌న కోరిక తీర్చాలంటూ టీడీపీ నేత ( TDP Leader) బెదిరింపుల‌కు పాల్ప‌డుతున్నాడు. ప్ర‌భుత్వం మాది (Government Ours) అని ఏదైనా చేస్తా అని టీడీపీ నాయ‌కుడు బెదిరిస్తున్నాడంటూ బాధిత మ‌హిళ ఒక వీడియోను విడుద‌ల చేసింది. బాధితురాలి వీడియో వైర‌ల్ కాగా, పల్నాడు జిల్లాలోని సత్తెనపల్లి (Sattenapalli) లో ఒక దళిత (Dalit) అంగన్వాడీ కార్యకర్తపై జరిగిన దారుణం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపుతోంది.

స్థానిక టీడీపీ నేత బొడ్డు వెంకటేశ్వరరావు (Boddu Venkateswara Rao) ఆమెను లైంగికంగా వేధించడమే (Sexually Harassing) కాకుండా “మేము కమ్మోళ్లం.. నువ్వు మాలదానివి.. ప్రభుత్వం మాది.. నువ్వు మమ్మల్ని ఏమీ చేయలేవు” అంటూ కులప్ర‌స్తావ‌న‌తో దిగజారిన మాటలు మాట్లాడుతూ త‌న‌ను బెదిరిస్తున్నాడ‌ని బాధిత మ‌హిళ క‌న్నీరు పెట్టుకుంది. బాధితురాలు భర్తను కోల్పోయి అంగన్వాడీ కార్యకర్తగా పనిచేస్తూ ఇద్దరు చిన్నపిల్లలను పోషిస్తూ జీవనం సాగిస్తోంది. ఇటువంటి పరిస్థితుల్లో టీడీపీ నేత బొడ్డు వెంక‌టేశ్వ‌ర‌రావు ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడడమే కాకుండా “నా కోరిక తీర్చకపోతే విధుల నుంచి తొలగిస్తా” అంటూ బెదిరిస్తున్నాడ‌ని మండిప‌డింది. ఈ ఘటనపై ఆమె సోషల్ మీడియాలో ఓ సెల్ఫీ వీడియో పోస్ట్ (Selfie Video) చేయగా, అది వైరల్‌గా మారింది. ఈ దారుణానికి న్యాయం కలగాలని కోరుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu)కు ఆమె విజ్ఞప్తి చేసింది.

పల్నాడు (Palnadu) జిల్లాలో ఇటువంటి ఘటనలు ఎక్కువవుతుండటంతో స్థానికులందరూ భయభ్రాంతులకు లోనవుతున్నారు. ప్రభుత్వానికి చెందిన శాఖ‌లో పనిచేస్తున్న మహిళలకే రక్షణ లేకపోతే, సాధారణ ప్రజల పరిస్థితి ఏంటి అన్న ప్ర‌శ్న‌లు ఉత్ప‌న్న‌మ‌వుతున్నాయి. బాధితురాలు విడుద‌ల చేసిన వీడియో(Video) లో టీడీపీ నేత ఆగ‌డాల గురించి ప్ర‌స్తావించిన‌ప్ప‌టికీ.. ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోకుండా ఇదంతా త‌ప్పుడు ప్ర‌చార‌మంటూ టీడీపీకి చెందిన కొంద‌రు కొట్టిప‌డేయ‌డంపై మ‌హిళ‌లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment