పారిశుద్ధ్య కార్మికురాలిపై టీడీపీ నేత‌ పాశ‌విక‌ దాడి..

పారిశుద్ధ్య కార్మికురాలిపై టీడీపీ నేత‌ పాశ‌విక‌ దాడి..

ఎన్టీఆర్ జిల్లా మైలవరం పట్టణంలో టీడీపీ నేత అధికార దుర‌హంకారం బహిర్గతమైంది. రామకృష్ణ కాలనీలో ఉదయం చెత్త సేకరిస్తున్న పారిశుధ్య కార్మికురాలు భవానీపై టీడీపీ నేత కఠారి ఉమామహేశ్వరరావు, ఆయన భార్య విచక్షణారహితంగా దాడి చేశారు. భవానీ తన విధులు నిర్వర్తిస్తున్న సమయంలో, వ‌స్తున్నాను 5 నిమిషాలు ఆగండి మేడం అని స‌మాధానం ఇచ్చినందుకు.. న‌న్ను 5 నిమిషాలు నిల్చోబెడ‌తావా.. అంటూ ఆగ్రహించిన టీడీపీ నేత భార్య మొదట నోరు పారేసుకోగా, తర్వాత ఉమామహేశ్వరరావు స్వయంగా కారుతో పారిశుద్ధ్య కార్మికురాలిని ఢీకొట్టాడు.

కిందపడిపోయిన భవానీపై మహిళ అని కూడా చూడకుండా ఉమామహేశ్వరరావు దారుణంగా కాళ్లతో తన్నుతూ దాడి చేశారు. ఈ ఘటనతో పారిశుధ్య కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ సహచరిపై జరిగిన దాడిని ఖండిస్తూ మైల‌వ‌రంలో ఆందోళ‌న చేప‌ట్టారు. దాడికి పాల్పడిన నేతపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.

టీడీపీ నేత‌ను క‌ఠినంగా శిక్షించాల‌ని పారిశుధ్య కార్మికులంతా మైలవరం పంచాయతీ కార్యాలయం వద్ద రోడ్డు పై బైఠాయించారు. ఉమామహేశ్వరరావు క్షమాపణ చెప్పాలని, అతని మీద ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ ప్రారంభించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment