ఆస్తి (Property) కోసం తల్లి (Mother), అక్క (Elder Sister)పై టీడీపీ (TDP) యువ నాయకుడు దాడికి పాల్పడ్డ ఘటన చిలకలూరిపేట (Chilakaluripet) పట్టణంలో వెలుగు చూసింది. వారం రోజుల క్రితం చోటుచేసుకున్న ఈ దారుణం వీడియోలు (Videos) ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బాధితులు పోలీసులను ఆశ్రయించినా, నిందితుడు స్థానిక ఎమ్మెల్యే అనుచరుడు (MLA Follower) కావడం వల్ల పోలీసులు (Police) పట్టించుకోవడం లేదని వాపోతున్నారు.
చిలకలూరిపేటలో తల్లి పై కొడుకు అరాచకం
— Telugu Feed (@Telugufeedsite) April 28, 2025
కొడుకు దాడి వీడియోలు వాట్సాప్లో పంపినా స్పందించని ఎమ్మెల్యే ప్రత్తిపాటి
ఆస్తి కోసం తల్లీ, అక్కను చిత్రహింసలు.. పచ్చి భూతులతో తల్లి, అక్కపై దాడి
డయల్ 100కు ఫిర్యాదు, చిలకలూరిపేట టౌన్ పోలీసు స్టేషన్‌లో బాధితుల ఫిర్యాదు#AndhraPradesh pic.twitter.com/djJEE42nFH
బాధితుల కథనం ప్రకారం.. చిలకలూరిపేట పట్టణంలోని పండరీపురానికి (Pandharipuram) చెందిన టీడీపీ (TDP) యువనేత చుండూరి ఉదయ్ వడ్డీ (Chunduri Uday) వ్యాపారం చేస్తుంటాడు. మూడు కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తి విషయంలో ఉదయ్, తల్లి నాగలక్ష్మి (Nagalakshmi), అక్కతో వివాదం తలెత్తింది. డబ్బులు (Money) ఇవ్వాలని తల్లి కోరగా, కొడుకు ఉదయ్ ఆగ్రహంతో వారిద్దరిపై దాడికి దిగాడు. తల్లి, అక్కను కింద పడేసి కాళ్లతో, కర్రలతో తీవ్రంగా కొట్టాడు. ఈ దాడికి సంబంధించిన దృశ్యాలను నాగలక్ష్మి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదని బాధితులు చెబుతున్నారు. తమకు ప్రాణహాని ఉందంటూ సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహాయాన్ని సోషల్ మీడియా ద్వారా కోరుతున్నారు.
