తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) 44వ ఆవిర్భావ దినోత్సవంలో వింత ఘటన చోటు చేసుకుంది. ఆవిర్భావం సందర్భంగా మంగళగిరి (Mangalagiri) టీడీపీ ఆఫీస్‌లో ఘనంగా ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు (Chandrababu), లోకేష్ (Lokesh) సహా, మంత్రులు, ఎమ్మెల్యేలు, టీడీపీ ముఖ్య నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. పార్టీ కార్యాలయ పార్టీ జెండా (Party Flag) ను ఎగురవేసేందుకు సీఎం చంద్రబాబు అక్కడకు చేరుకున్నారు. తాడుతో జెండా ఎగురవేసే ప్రయత్నం చేయగా, వేసిన ముడి (Knot) వీడలేదు. చంద్రబాబు తీవ్ర అసహనానికి గురి కావాల్సి వచ్చింది.
ఎంతసేపటికీ ముడి వీడకపోవడంతో చేసేది ఏమీ లేక ఎత్తిన జెండాను కిందకు దించి ముడి విప్పి మరీ పైకి ఎగరేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ సన్నివేశం సోషల్ మీడియా (Social Media)లో వైరల్‌గా మారింది. నెటిజన్లు అధికార పార్టీపై ట్రోలింగ్ మొదలుపెట్టారు. ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పార్టీ పండగలో నేతల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లుగా కనిపించింది. అందరూ అధినేతను, చినబాబును ప్రసన్నం చేసుకునే ప్రయత్నాల్లోనే నిమగ్నమయ్యారే తప్ప.. ఇలాంటి చిన్న విషయాలను విస్మరించడం పట్ల చంద్రబాబు సీరియస్ కావాల్సిన పరిస్థితి ఏర్పడింది.